భారత జట్టు క్రికెటర్ సూర్య కుమార్ యాదవ్ అభిమానుల కోరిక మేరకు ముంబైలో గల్లీ క్రికెట్ ఆడుతూ చాలా ఎంజాయ్ చేశాడు.అతను కొట్టిన సల్ఫాషాట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ ఫోటోలను స్వయంగా సూర్య కుమార్ యాదవ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.సూర్య కుమార్ యాదవ్ అంటే టీ 20 ఫార్మాట్ లో నెంబర్ వన్ బ్యాటర్ అని అందరికీ తెలిసిందే.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 సిరీస్ లో భాగంగా టెస్ట్ మ్యాచ్ లలో ఎంట్రీ ఇచ్చాడు.శ్రేయస్ అయ్యర్ గాయంతో జట్టులో లేకపోవడంతో, సూర్య కుమార్ యాదవ్ కు స్థానం దక్కింది.

అయితే తొలి టెస్ట్ మ్యాచ్ లోనే విఫలమయ్యాడు.నాగపూర్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో 20 బంతులకు ఎనిమిది పరుగులు చేసి నాథన్ లియోన్ చేతిలో అవుట్ అయ్యాడు.రెండవ మ్యాచ్లో శ్రేయర్ రావడంతో సూర్యకుమార్ కు విశ్రాంతి లభించింది.ఇటీవలే కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని, స్వస్థలం ముంబైలో ఉన్నాడు.తన సోదరుల కోరిక మేరకు గల్లీ క్రికెట్ ఆడుతూ కాస్త సందడి చేశాడు.ఆస్ట్రేలియా -ఇండియా నాల్గవ టెస్ట్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ కు బదులు సూర్య కుమార్ యాదవ్ ను ఆడిస్తే బాగుంటుంది అని కొందరు మాజీలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఈ సిరీస్ లో రెండు మ్యాచ్ లలో శ్రేయస్ అయ్యర్ 16,26 పరుగులు చేశాడు.ఇటువంటి పరిస్థితులలో మేనేజ్మెంట్ కొన్ని కీలక మార్పులు చేసి సూర్య కుమార్ యాదవ్ కు అహ్మదాబాద్ లో జరిగే టెస్ట్ మ్యాచ్లో అవకాశం ఇస్తే బాగుంటుంది అని సూచించారు.ప్రస్తుతం సూర్య కుమార్ యాదవ్ కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నాడు, గల్లీలో ఆడిన క్రికెట్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది.







