'రామారావు ఆన్ డ్యూటీ' లో సీఐ మురళిగా వేణు తొట్టెంపూడి పరిచయం

కొంత విరామం తర్వాత నటుడు వేణు తొట్టెంపూడి, మాస్ మహారాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’ తో తిరిగి వెండితెరపై సందడి చేయబోతున్నారు.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

 Introducing Venu Thottempudi As Ci Murali In Slv Cinemas’ Ramarao On Duty , R-TeluguStop.com

ఈ చిత్రంలో వేణు చాలా కీలకమైన పాత్రను పోషించారు.ఆయన క్యారెక్టర్ పోస్టర్‌ ను విడుదల చేశారు నిర్మాతలు.

ఈ పోస్టర్ లో సీఐ మురళిగా వేణు కాస్త సీరియస్‌ గా కనిపిస్తున్నారు.ఈ పాత్ర దాదాపు సినిమా మొత్తం రవితేజతో కలిసి ప్రయాణిస్తుంది.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా, మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు సంగీత ప్రియులను అలరించాయి.ముఖ్యంగా మూడో సింగిల్ ‘నా పేరు సీసా’ మాస్ ని మెస్మరైజ్ చేసింది.

త్వరలోనే ఈ సినిమా టైటిల్ సాంగ్‌ ని విడుదల చేయనున్నారు.సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారుఈ చిత్రాన్ని జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube