మెగా పవర్ స్టార్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్( Ram Charan ) ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ అవడంతో ప్రస్తుతం గ్లోబల్ హీరోగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.మరి ఇలాంటి క్రమం లోనే ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది.
ఇక ఇప్పుడు ఆయన శంకర్ డైరెక్షన్ లో గేమ్ ఛేంజర్( Game Changer ) అనే సినిమా చేస్తున్నాడు.అలాగే బుచ్చిబాబు సన డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు.

మరి ఇలాంటి క్రమంలో రామ్ చరణ్ ప్రస్తుతం మరొక సినిమా చేయడానికి కూడా కమిట్ అయినట్టుగా తెలుస్తుంది.అసలు విషయంలోకి వెళ్తే స్టార్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్( Trivikram ) ప్రస్తుతం రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇంతకుముందు ఆయన అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సింది కానీ ఇప్పుడు కానీ గుంటూరు కారం( Guntur Karam ) సినిమా ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఆ సినిమా హోల్డ్ లో పడింది.దాంతో ఇప్పుడు త్రివిక్రమ్ రామ్ చరణ్ ను హీరోగా పెట్టి ఒక సినిమా చేయాలని చూస్తున్నాడు.

ఇక దానికి రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.మరి దానికి సంబంధించిన స్క్రిప్ట్ పనులను ప్రస్తుతం త్రివిక్రమ్ పూర్తి చేస్తున్నట్టు గా తెలుస్తుంది.ఇక వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఆ సినిమాకి తిరుగు ఉండదనే చెప్పాలి.ఎందుకంటే గురూజీ డైలాగ్స్ కి రామ్ చరణ్ పర్ ఫెక్ట్ గా సెట్ అవుతాడు.
కాబట్టి వీళ్ళ కాంబో లో వచ్చే సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది.గురూజీ, రామ్ చరణ్ కాంబినేషన్ కోసం ఎప్పటినుంచో మెగా అభిమానులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు.అది ఇప్పటికీ వర్కౌట్ అవుతున్నందుకు సంతోషిస్తున్నారు…
.







