మహి వి రాఘవ్ డైరెక్షన్ లో తెరకెక్కిన యాత్ర2 మూవీ( Yatra 2 ) రిలీజ్ కావడానికి మరో 48 గంటల సమయం మాత్రమే ఉంది.రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్క్రీన్లలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు బుకింగ్స్ భారీ స్థాయిలోనే ఉండబోతున్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.మహి వి రాఘవ్( Mahi V Raghav ) ఈ సినిమాను బాగానే తీసి ఉంటారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మహి వి రాఘవ్ మాట్లాడుతూ ఆనందో బ్రహ్మ సక్సెస్ కావడంతో నా మార్కెట్ పెరిగిందని ఆయన తెలిపారు.

హీరోను దృష్టిలో పెట్టుకుని మనం సినిమాలు రాయలేమని ఆయన అన్నారు.యాత్ర సినిమా రియల్ పొలిటీషియన్ గురించి కాకపోతే మరింత బెటర్ రిజల్ట్ వచ్చేదేమో అని మహి వి రాఘవ్ అభిప్రాయపడ్డారు.ఆ కథ పుట్టిందే వైఎస్సార్( YSR ) వల్ల పుట్టిందని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.
వైఎస్సార్ మరణం తర్వాత చాలామంది ఆయన గురించి పాజిటివ్ గా మాట్లాడారని మహి వి రాఘవ్ అన్నారు.అందువల్లే నేను యాత్ర దిశగా అడుగులు వేశానని ఆయన కామెంట్లు చేశారు.
సినిమాల వల్ల ఒక్క ఓటు కూడా పడదని మహి వి రాఘవ్ అన్నారు.వైఎస్సార్ ను ఇష్టపడే వాళ్లలో సగం మంది చూసినా బాహుబలి రేంజ్ కలెక్షన్లు వస్తాయని ఆయన వెల్లడించారు.
ఓటర్లు( Voters ) అనేవాళ్లకు వాళ్ల లెక్కలు ఉంటాయని మహి తెలిపారు.

సినిమా చూసే సమయంలో ఉన్న భావన బయటకు వెళ్లాక ఉండదని ఆయన కామెంట్లు చేశారు.ఎన్నికల సమయంలో ఈ సినిమాలకు అంతో ఇంతో డిమాండ్ ఉంటుందని అందుకే ఇలాంటి సమయంలో రిలీజ్ చేస్తామని మహి పేర్కొన్నారు.ఇండియాలో పొలిటికల్ సినిమాలు( Political Movies ) ఎక్కువగా ఆడవని ఆయన పేర్కొన్నారు.







