పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ”ఆదిపురుష్”.రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించారు.ఇందులో ప్రభాస్ రాముడిగా నటిస్తుంటే.సీతగా కృతి సనన్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇక లంకేశ్వరుడు రావణాసురిడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.లక్ష్మణుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ నటిస్తున్నాడు.ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ రిలీజ్ అయ్యింది.ఈ టీజర్ రిలీజ్ తర్వాత ఓం రౌత్ మీద ఎన్నో విమర్శలు వచ్చాయి.దీంతో టీమ్ అంతా గ్రాఫిక్స్ విషయంలో మరోసారి డైలమాలో పడ్డారు.

మరింత గ్రాండ్ గా గ్రాఫిక్స్ డిజైన్ చేయాలని రిలీజ్ సైతం వాయిదా వేశారు.లేకపోతే ఈ సినిమా ఇప్పుడు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యేది.ఇక ఈ సినిమా వాయిదా వేయడంతో డార్లింగ్ ఫ్యాన్స్ సైతం నిరాశ చెందారు.
ఈ సినిమాను సంక్రాంతి బరిలో నుండి తప్పిస్తూ జూన్ 16కు వాయిదా వేశారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

రాముడి పాత్రలో నటిస్తున్న ప్రభాస్ ఈ సినిమాలో ఒక భారీ డైలాగ్ చెప్పాడట.రాముడి పాత్ర యొక్క ఆలోచన విధానాన్ని చెప్పడానికి మేకర్స్ రెండు పేజీల భారీ డైలాగ్ ను రాశారట.మరి డార్లింగ్ కెరీర్ లోనే అంత పెద్ద డైలాగ్ ను ఇంతవరకు ఏ సినిమాలో చెప్పలేదు అని తెలుస్తుంది.మొదటిసారి ఈ సినిమా కోసమే ప్రభాస్ అతి పెద్ద డైలాగ్ చెప్పాడని అంటున్నారు.
చూడాలి ఈ సినిమా ఎలా ఆకట్టు కుంటుందో.







