టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు( Mohan Babu ) గురించి మనందరికీ తెలిసిందే.తెలుగులో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి హీరోగా నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు మోహన్ బాబు.
ఆయన నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కనెక్షన్ల సునామిని సృష్టించాయి.ఇక ఆయన నటించిన సినిమాలలో అల్లుడుగారు సినిమా( Alludugaru Movie ) కూడా ఒకటి.
కాగా నేడు ఆయన పుట్టిన సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
జగదేక వీరుడు అతిలోక సుందరి 1990 విజయంతో దర్శకుడు రాఘవేంద్రరావు( Director Raghavendra Rao ) క్రేజ్ రెట్టింపయ్యింది.దీంతో, ఆయన తదుపరి ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన అల్లుడుగారు మూవీను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు.
ఆ క్రమంలో.సూపర్‌హిట్ తర్వాత చేస్తున్న చిత్రమిది.
అందుకే పెద్ద హీరోని తీసుకోండి.ఎందుకు మోహన్‌బాబుతో తీస్తున్నారు? అని రాఘవేంద్రరావుతో కొందరు అన్నారట.వారి మాటలను పట్టించుకోకుండా రాఘవేంద్రరావు తనతో ఆ చిత్రాన్ని తెరకెక్కించారని మోహన్‌బాబు ఒక సందర్భంలో నాటి సంగతులు గుర్తుచేసుకున్నారు.
32 రోజుల్లో చిత్రీకరణ పూర్తయిందని తెలిపారు.శోభన,( Sobhana ) రమ్యకృష్ణ( Ramya Krishna ) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 1990 సెప్టెంబరు 28న విడుదలైంది.ఈ చిత్రం పలు థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం.
ముద్దబంతి నవ్వులో, కొండమీద చుక్కపోటు ఇలా ఇందులోని పాటలన్నీ ఇప్పటికీ మార్మోగుతూనే ఉన్నాయి.అంతే కాకుండా ఈ సినిమాలోని పాటలు ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు.