టాలీవుడ్ హీరో రవితేజ( Ravi Teja ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.ఒకదాని తర్వాత ఒకటి సినిమాలలో నటిస్తూ ఈతరం హీరోలకు గట్టి పోటీలు ఇస్తున్నారు.
అంతే కాకుండా ఈ మధ్యకాలంలో ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టి పాన్ ఇండియా హీరోగా ఎదిగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ వంటి సినిమాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేసిన రవితేజ కొంతవరకు సక్సెస్ అయ్యారు.
రవితేజ ప్రస్తుతం హరీశ్ శంకర్ తో చేస్తున్న మిస్టర్ బచ్చన్( Mr Bachchan ) సినిమా మీదే ఆయన అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైనట్టు ఈ సినిమా బృందం తెలిపింది.అయితే నిజానికి ఎంత పెద్ద స్టార్ హీరో, హీరోయిన్ అయిన సరే ఫేవరెట్ హీరో, హీరోయిన్, దర్శకులు ఉండటం సహజమే.ఇకపోతే రవితేజ కూడా ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో తనకు నచ్చిన హీరోయిన్ గురించి ప్రస్తావించారు.
ఒక ఇంటర్వ్యూలో అనుష్క, ఇలియానా, త్రిష, శ్రియ వీరిలో ఎవరు ఇష్టం అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు.నాకు అనుష్క( Anushka ) అంటే ఇష్టం.ముఖ్యంగా ఆమె యాక్టింగ్ ఎంతో ఇష్టం.కాగా రవితేజ అనుష్క తో కలిసి విక్రమార్కుడు సినిమా( Vikramarkudu )లో నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అవ్వగా ఈ సినిమా తర్వాత వచ్చిన బలాదూర్ డిజాస్టర్ గా నిలిచింది.

ఇకపోతే ఆ ఇంటర్వ్యూలో అడిగిన హీరోయిన్ల అందరితోనూ రవితేజ ఒక్కో హిట్ సాధించారు.ముఖ్యంగా హీరోయిన్ ఇలియానాతో ఖతర్నాక్, కిక్, దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోని సినిమాలు చేశారు.వీటిలో ‘కిక్( Kick )’ సూపర్ డూపర్ హిట్ సంధించింది.
అలాగే మరో హీరోయిన్త్ త్రిషతో చేసిన కృష్ణ సినిమాలో నటించగా అది బాక్స్ ఆఫీస్ దగ్గర అది భారీ హిట్ అందుకుంది.ఇక మరో హీరోయిన్శ్ శ్రీయతో చేసిన భగీరథ ఆశించిన హిట్ సాధించలేకపోయింది.







