టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగే సెలబ్రిటీలకు దర్శక నిర్మాతల నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయని విషయం మనకు తెలిసిందే.ఇలా ఎంతోమంది కెరియర్లో ఇబ్బందులు ఎదుర్కొని తమ జీవితాలను నాశనం చేసుకున్నటువంటి సెలబ్రిటీలు ఎందరో ఉన్నారు.
అయితే ఒక హీరో కారణంగా టాలీవుడ్( Tollywood ) ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి నటి శ్రేయ శరణ్ ( Shreya Saran ) కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారని తెలుస్తుంది.ఆయన వల్ల ఈమె ఏకంగా సినిమా అవకాశాలు కూడా కోల్పోయారని చెప్పాలి.
ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాష చిత్రాలలో అగ్రతారక ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శ్రేయ మూడు తరం హీరోలతో నటించారు.

ప్రస్తుతం ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ ( Character artist )గా ఇండస్ట్రీలో స్థిరపడిన సంగతి తెలిసిందే.ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగినటువంటి శ్రియకు ఉన్నఫలంగా సినిమా అవకాశాలు లేకుండా పోయాయి .ఇలా ఈమెకు సినిమా అవకాశాలు లేకపోవడంతో తిరిగి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.మరి ఈమెకు సినిమా అవకాశాలు రాకపోవడానికి కారణం ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక స్టార్ హీరో అని తెలుస్తుంది.ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి ఈమెను ఆ హీరో పెళ్లి చేసుకోవాలి అంటూ చాలా టార్చర్ చేశారట.

ఇలా ఆయన టార్చర్ చేయడంతోనే ఈమె ఇండస్ట్రీకి దూరమయ్యారని తెలుస్తుంది.అయితే అప్పటికే ఆ హీరోకి పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉండడంతో శ్రియకు ఆ హీరోని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకుండా పోయింది దీంతో రిజెక్ట్ చేయడంతో తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కూడా తనకు అవకాశాలు రాకుండా చేశారని అందుకే ఈమె కొంతకాలం పాటు దూరమైనా తిరిగి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడ్డారని తెలుస్తుంది.ప్రస్తుతం ఈమె తెలుగు తమిళ భాష చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు.







