సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి.అయితే ఎక్కువగా ప్రేమ కథ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుందనే విషయం మనకు తెలిసిందే.
ఇలా ప్రేమ కథ చిత్రాలకు అభిమానులు కూడా ఫిదా అవుతూ ఉంటారు.ఇప్పటికే ఎన్నో ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఇలా ప్రేమ కథ సినిమాల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుని ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాయి కానీ మరికొన్ని సినిమాలు కంటెంట్ ఉన్నప్పటికీ కొన్ని కారణాలవల్ల ఆ సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమవుతూ ఉంటాయి.
ఇలా అద్భుతమైన కంటెంట్ ఉన్నప్పటికీ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినటువంటి సినిమాలలో ఓయ్ ( Oy ) ఒకటి.
ఆనంద్ రంగా దర్శకత్వంలో తెరకెక్కినటువంటి ఈ చిత్రానికి సిద్ధార్థ్ ( Siddharth ) హీరోగా నటించిన బేబీ షామిలి ( Shamili ) హీరోయిన్గా ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు ఎంట్రీ ఇచ్చారు.ఈ సినిమాలో ఈమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఎంతో అద్భుతమైనటువంటి ప్రేమకథా చిత్రముగా మాత్రమే కాకుండా ఈ సినిమాలోని పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అయితే ఈ సినిమా విడుదలైనప్పుడు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
దాదాపు దశాబ్దన్నర కాలం తర్వాత తిరిగి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఇటీవల ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమాని థియేటర్లలో విడుదల చేశారు.దీంతో ఈ సినిమాకు విపరీతమైనటువంటి ఆదరణ లభించింది.
అయితే ఈ సినిమా తిరిగి విడుదలవుతున్నటువంటి తరుణంలో డైరెక్టర్ ఆనంద్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొని ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.ఈ సినిమాకు ఓయ్ అని టైటిల్ పెట్టడానికి కారణం లేకపోలేదని ఇందులో హీరోయిన్ వన్ ఇయర్ మాత్రమే బ్రతికి ఉంటుంది కనుక ఈ సినిమాకు Oy అనే టైటిల్ పెట్టారని తెలుస్తుంది.
ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ కాస్ట్యూమ్స్ గురించి డైరెక్టర్ ఇటీవల చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాలో హీరోయిన్ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా సూర్యాస్తమయాన్ని సూచించే విధంగానే ఉంటాయని తెలిపారు.ఇందులో షామిలి సంధ్య అనే పాత్రలో నటించారు.సంధ్య అంటే సూర్యాస్తమయం ( Sunset )అనే సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈమె డ్రెస్సులు అన్నీ కూడామొదట ప్రకాశవంతమైన పసుపు.తర్వాత నారింజ తర్వాత ఎరుపు చివరికి నలుపు రంగు డ్రెస్సులని వేసుకుంటుంది అంటూ డైరెక్టర్ ఈ సీక్రెట్ రియల్ చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.