బొబ్బిలి పులి షూటింగ్ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ తీసుకున్న షాకింగ్ నిర్ణయం ఇదే?

సీనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో బొబ్బిలి పులి సినిమా ఒకటనే సంగతి తెలిసిందే.1982 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది.

దాసరి నారాయణరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

ప్రముఖ దర్శకులలో ఒకరైన నందం హరిశ్చంద్రరావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ నటించిన మనుషులంతా ఒక్కటే సినిమాలో ఒక్క డ్యూయెట్ కూడా లేదని అయినప్పటికీ ఆ సినిమా హిట్ అయిందని తెలిపారు.ఆ సమయంలో నిర్మాతలు, జర్నలిస్టులు దాసరి నారాయణరావు గారిని మెచ్చుకున్నారని నందం హరీశ్చంద్రరావు అన్నారు.

ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి సర్దార్ పాపారాయుడు స్పూర్తిని ఇచ్చిన సినిమా అని నందం హరీశ్చంద్రరావు పేర్కొన్నారు.కచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్లాలని ఉద్దేశం కలిగించిన సినిమా బొబ్బిలి పులి అని నందం హరిశ్చంద్రరావు పేర్కొన్నారు.

ఆ సినిమా షూటింగ్ సమయానికే చంద్రబాబు మంత్రిగా ఉన్నారని నందం హరిశ్చంద్రరావు అన్నారు.

Advertisement

బొబ్బిలిపులి కోర్టు సీన్ సమయంలో చంద్రబాబు మంత్రి పదవి పోయిందని ఎన్టీఆర్ కు తెలిసి షూటింగ్ ఆపాలని ఎన్టీఆర్ చెప్పారని నందం హరిశ్చంద్రరావు పేర్కొన్నారు.రామారావు గారు తర్వాత రోజున సీరియస్ గా ఉన్నారని ఆ సమయంలోనే బొబ్బిలిపులి క్లైమాక్స్ షూటింగ్ చేసి రాజకీయ పార్టీ పెట్టాలని సీనియర్ ఎన్టీఆర్ నిర్ణయం తీసుకున్నారని నందం హరీశ్చంద్రరావు అన్నారు.

దాసరి నారాయణరావు కూడా సీనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల విషయంలో ప్రోత్సహించారని నందం హరీశ్చంద్రరావు వెల్లడించారు.సెన్సార్ సభ్యులు బొబ్బిలిపులి సినిమాను బ్యాన్ చేస్తున్నామని చెప్పారని ఆ తర్వాత సమస్య పరిష్కారమైందని నందం హరీశ్చంద్రరావు పేర్కొన్నారు.ఆ తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆ పార్టీని అధికారంలోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

బొబ్బిలి పులి సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడంతో పాటు భారీ స్థాయిలో కలెక్షన్లను సైతం సాధించిందని చెప్పవచ్చు.

సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?
Advertisement

తాజా వార్తలు