అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ జాతీయ వృక్షం ఓక్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ఓక్ వృక్షాన్ని బాలుట్ లేదా చెస్ట్‌నట్ అని కూడా పిలుస్తారు.ఇది 600కు మించిన జాతులను కలిగి ఉంది.

 Interesting Facts About Oak Tree, America, England, France, Oak Tree, Ballet Or-TeluguStop.com

ఇది అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్ జాతీయ వృక్షంగా గుర్తింపు పొందింది.ఇప్పుడు ఈ చెట్టుకు సంబంధించిన కొన్ని ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.

1.ఓక్ చెట్టు చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది.అందుకే దీనిని రోడ్ల వెంబడి, పార్కులలో నాటుతుంటారు.2.వివిధ జాతులకు చెందిన ఓక్ చెట్టు ఆకులలో కొద్దిగా తేడాలు కనిపించినప్పటికీ అన్నీ ఒకే మాదిరిగా కనిపిస్తాయి.3.ఓక్ చెట్టు పండు పండిన తర్వాత ఎరుపు రంగులోకి మారుతుంది.మధ్యలో పసుపు రంగులో ఉంటుంది.ఈ పండును బంజ్ పండు అని అంటారు.4.ఓక్ పండ్లు తీపిగా, చేదుగా ఉంటాయి.ఈ పండ్లను తినడమే కాకుండా, చట్నీస్ కూడా తయారు చేస్తారు.5.ఈ పండ్ల గుజ్జును పందులకు ఆహారంగా వేస్తారు.అందుకోసం ముందుగా పండును ఉడకబెట్టి ఎండబెట్టి పందులకు ఆహారంగా ఇస్తారు.6.మీరు ఓక్ చెట్టును పెంచాలనుకుంటే, దాని పండ్ల సహాయంతో మాత్రమే దానిని పెంచవచ్చు.ఓక్ చెట్టు సంవత్సరానికి 2000 ఓక్ పండ్లను ఇస్తుంది.వాటిలో 150 పండ్లు మాత్రమే విత్తనాలుగా మారి కొత్త చెట్లు మొలకెత్తేలా చేస్తాయి.7.ఓక్ చెట్టు పెరగడానికి చాలా సమయం పడుతుంది.ఈ చెట్టు 200 నుండి 300 సంవత్సరాల వరకు జీవించగలదు.ఇది 20 సంవత్సరాలు దాటాక ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది.8.ఓక్ చెట్లు అనేక రంగులలో ఉంటాయి.ఆకుపచ్చ, ఎరుపు నలుపు రంగులలో కనిపిస్తాయి.ఈ చెట్లు దాదాపు 100 నుండి 150 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి.9.ఓక్ చెట్టు కలప చాలా ఉత్తమమైనదిగా గుర్తింపు పొందింది.ఇది 100 సంవత్సరాలకుపైగా మన్నిక కలిగివుంటుంది.దీనిని ఫర్నిచర్ తయారీలో ఉపయోగిస్తారు.10.భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లో ఓక్ చెట్లకు చాలా ప్రాముఖ్యత ఉంది.దానిని అక్కడ ఆకుపచ్చ బంగారం అని పిలుస్తారు.

Interesting Facts About Oak Tree

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube