బిగ్ బాస్ ఆదిరెడ్డికి అలాంటి అవమానాలు.. తల్లి చనిపోతే ఇంటికే పరిమితమై?

మరో రెండు రోజుల్లో బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్6 షూటింగ్ మొదలుకానుంది.

ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో కొన్ని పేర్లు తెగ వైరల్ అవుతున్నాయి.

అలా వైరల్ అవుతున్న పేర్లలో బిగ్ బాస్ రివ్యూల ద్వారా పాపులర్ అయిన ఆదిరెడ్డి ఒకరు.అయితే ఆదిరెడ్డి ఈ స్టేజ్ కు రావడానికి పడిన కష్టం మాత్రం అంతాఇంతా కాదు.

సాధారణ కుటుంబంలో జన్మించిన ఆదిరెడ్డి నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు అనే గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.బీటెక్ చదివిన తర్వాత ఉద్యోగానికి ఎంపికైన ఆదిరెడ్డికి అదే సమయంలో తల్లి ఆత్మహత్య చేసుకుని మరణించడం ఎంతో బాధ పెట్టింది.

ఆ బాధ వల్ల ఉద్యోగంలో జాయిన్ కాకుండా ఆదిరెడ్డి ఇంటికే పరిమితమయ్యారు.ఆ సమయంలో ఆదిరెడ్డి బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నారు.

Advertisement

అలాంటి అవమానాలు ఎదురుకావడంతో పాటు కుటుంబ పోషణ భారంగా మారడంతో ఆదిరెడ్డి ఇబ్బంది పడ్డారు.ఆ తర్వాత బెంగళూరులో జాబ్ లో జాయిన్ అయిన ఆదిరెడ్డి కౌశల్ పై చేసిన వీడియో ద్వారా పాపులర్ అయ్యారు.

బిగ్ బాస్ రివ్యూలతో యూట్యూబ్ ద్వారా ఆదిరెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు దగ్గరయ్యారు.ఆదిరెడ్డి బిగ్ బాస్ షోలో ఎన్ని వారాలు కొనసాగుతారో చెప్పలేం కానీ ఆయన వ్యక్తిత్వం మాత్రం గొప్పదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.ఆదిరెడ్డి సోదరి నాగలక్ష్మి కరోనా టైమ్ లో 15 వేల రూపాయలు సోనూసూద్ ట్రస్ట్ కు ఇవ్వడం ద్వారా వార్తల్లో నిలిచారు.

అంధురాలు అయిన నాగలక్ష్మి సాయం అందించడం గురించి సోనూసూద్ ట్వీట్ ద్వారా ప్రశంసించారు.అయితే సామాన్య ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవడం ఆదిరెడ్డికి ఒక విధంగా మైనస్ అని చెప్పవచ్చు.

ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?
Advertisement

తాజా వార్తలు