పూనమ్ కౌర్ లో ఉన్న ఈ అరుదైన టాలెంట్ గురించి మీకు తెలుసా?

ఈ మధ్య కాలంలో పూనమ్ కౌర్ పేరు సోషల్ మీడియా, వెబ్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న్ పూనమ్ కౌర్ సినిమాల కంటే ఇతర విషయాల ద్వారానే ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకుంటున్నారు.

 Interesting Facts About Actress Poonam Kaur Goes Viral, Poonam Kour , Tollywood-TeluguStop.com

పూనమ్ కౌర్ పంజాబీ అమ్మాయి అయినప్పటికీ ఆమె పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనే కావడం గమనార్హం.పూనమ్ కౌర్ ఫ్యాషన్ డిజైనింగ్ లో గ్రాడ్యుయేషన్ చేశారు.

ఒక వి చిత్రం అనే సినిమా పూనమ్ కౌర్ తొలి సినిమా కాగా ఆమె నటించిన మాయాజాలం సినిమా మొదట రిలీజ్ కావడం గమనార్హం.తమిళ, కన్నడ సినిమాలలో సైతం పూనమ్ కౌర్ నటించినా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేదు.

గోపీచంద్ హీరోగా తెరకెక్కిన శౌర్యం సినిమాలో పూనమ్ కౌర్ సహాయనటిగా నటించగా ఆ సినిమాకు పూనమ్ కౌర్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కటం గమనార్హం.

Telugu Kannada, Kollywood, Languages, Mayajalam, Poonam Kaur, Punjabi, Souryam-M

శౌర్యం సక్సెస్ సాధించినా ఈ బ్యూటీకి పెద్దగా ఆఫర్లు రాలేదు.అయితే పూనమ్ కౌర్ లో ప్రేక్షకులకు పెద్దగా తెలియని అరుదైన టాలెంట్ ఉంది.పూనమ్ కౌర్ ఐదు భాషలలో అనర్గళంగా మాట్లాడగలరు.

ఇంగ్లీష్ తో పాటు హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నాన్ స్టాప్ గా మాట్లాడగలిగే ప్రతిభ ఉంది.బాలీవుడ్ మూవీ జునూనియట్ లో పూనమ్ కనిపించడం గమనార్హం.

పొలిటీషియన్స్ మధ్య విభేదాల వల్ల పూనమ్ కౌర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.

Telugu Kannada, Kollywood, Languages, Mayajalam, Poonam Kaur, Punjabi, Souryam-M

సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండే నటీమణులలో ఒకరైన పూనమ్ కౌర్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇవ్వడంతో పాటు ప్రకాష్ రాజ్ గెలవడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో విజయం సాధిస్తారో లేదో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube