FIFA World Cup 2022: ఫిఫా వరల్డ్ కప్-2022లో ఆసక్తికర ఘట్టాలివే..

ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ కొనసాగుతోంది.అప్పుడే గ్రూప్ దశ ముగిసిపోయి 16వ రౌండ్‌ మొదలైపోయింది.

 Interesting Events In Fifa World Cup 2022 Fifa World Cup, Football World Cup, Fi-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు జరిగిన 2022 మ్యాచ్‌లలో వెలుగు చూసిన ఆసక్తికర అంశాలు, గణాంకాలపై ఒక కన్నేద్దాం.ముందుగా గోల్స్ గురించి తెలుసుకుంటే.

ఇప్పటివరకు మొత్తం 12 గోల్స్‌తో ఇంగ్లాండ్ టాప్ పొజిషన్‌లో ఉంది.స్టార్టింగ్ మ్యాచ్‌లోనే ఈ జట్టు ఇరాన్‌పై ఆరు గోల్స్‌ సాధించింది.

ఇక గోల్స్ ఎక్కువ చేసిన వాటిలో ఫ్రాన్స్‌, స్పెయిన్‌లు ఉన్నాయి.ఇవి ఒక్కోటి తొమ్మిది గోల్స్‌ చేశాయి.

ఇక క్రొయేషియాతో జరిగిన ఓ మ్యాచ్‌లో కెనడా ప్లేయర్‌ అల్ఫోన్సో డేవిస్‌ రెఫ్‌ విజిల్‌ ఫాస్టెస్ట్ గోల్‌ రికార్డును సృష్టించాడు.ఈ ప్లేయర్ జస్ట్ 1 నిమిషం 8 సెకన్లలో గోల్‌ నమోదు చేశాడు.అతని తర్వాత మొరాకో టీమ్ ప్లేయర్ హకీమ్‌ జియెచ్‌ 2.31 నిముషాలు గోల్ చేసి ఆశ్చర్యపరిచాడు.ఇకపోతే ఇంగ్లాండ్‌ ప్లేయర్ హ్యారీకేన్‌ గోల్డెన్‌ బూట్‌ రేసులో ముందంజలో ఉండగా.రాష్‌ఫోర్డ్‌, రహీమ్‌ స్టెర్లింగ్‌లు అతనికి పోటీనిస్తున్నారు.

Telugu Fifa Cup, Football, Football Cup-Latest News - Telugu

రెడ్‌, ఎల్లో కార్డులు అందుకున్న ప్లేయర్ల వివరాలు చూసుకుంటే.ఇరాన్ ఆటగాడు మెహదీ తరేమీపై ఫౌల్ చేసిన వేల్స్ గోల్ కీపర్ వేన్ హెన్నెస్సీని రిఫరీ మారియో ఎస్కోబార్ బయటకు పంపాడు.పెనాల్టీల విషయానికి వస్తే.ఇప్పటివరకు చాలామంది చాలా జాగ్రత్తగా ఆడుతూ పెనాల్టీలు తీసుకోకుండా స్కోర్ పెంచుకున్నారు.ఇప్పటిదాకా ఏ ఒక్క టీమ్ కూడా ఒకటికంటే ఎక్కువ పెనాల్టీలను ఫేస్ చేయలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube