తన రాజీనామాతో ప్రధాన పార్టీలు మునుగోడుకు కదలి వచ్చాయని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 8 ఏండ్లు పూర్తయినా.
మునుగోడు అభివృద్ధి కుంటుబడిందన్నారు.మునుగోడును పట్టించుకోని కేసీఆర్ చండూర్‌కి వచ్చి హామీలిచ్చి వెళ్లారన్నారు.
టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే 15 రోజుల్లోనే మునుగోడు సమస్యలు పరిష్కరిస్తానని చెప్తున్నారన్నారు.ఇదంతా తాను రాజీనామా చేయడం వల్ల వచ్చిన ప్రభావమని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ మార్పు కోసమే తాను రాజీనామా చేసినట్లు రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
గతంలో ఇచ్చిన హామీలపై సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించగా.
మాట తప్పించుకుని కేసీఆర్ వెళ్లిపోయాడని రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.మునుగోడులో టీఆర్‌ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మన్లు నెలరోజులుగా కవాతు చేస్తున్నా.
ఓటర్లు తనకే పట్టం కడుతారని రాజగోపాల్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.మునుగోడు నుంచే కేసీఆర్ పాలనకు అంతం ప్రారంభమవుతుందని, జాతీయ పార్టీ బీఆర్ఎస్‌కు మునుగోడు ఓటర్ల సమాధి కడతారని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

మునుగోడులో బీజేపీ గెలుపు ఖాయంమునుగోడులో ఈ సారి బీజేపీ గెలుపు ఖాయమని అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.ప్రజలు తననే కచ్చితంగా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.టీఆర్ఎస్‌కు చెందిన 87 ఎమ్మెల్యేలు, 16 మంది మంత్రులు, 15 మంది ఎమ్మెల్సీలు అధికారంలోకి రామనే భయంతో మునుగోడులో తిష్ట వేసుకుని కూర్చున్నారు.డబ్బులు, మందు, మాంసం పంచుతూ ప్రజలను మభ్య పెడుతున్నారు.
ఇలాంటి ప్రలోభాలకు మునుగోడు ప్రజలు లొంగరు.ప్రజల్లో చైతన్యం వచ్చింది.
వారికి మార్పు అర్థమైంది.ఎన్ని ప్రలోభాలు పెట్టినా.
సీఎం కేసీఆర్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.ఈ సారి భారీ మెజార్టీతో బీజేపీ గెలుస్తుందని రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
టీఆర్ఎస్‌కు, బీజేపీకి ఎలాంటి పోటీ లేదు.మునుగోడులో తన ఒక్కడినే ఓడించడానికి టీఆర్ఎస్ కౌరవ సేన నెల రోజులుగా ప్రచారం చేస్తోందన్నారు.
ప్రజలు ఈసారి టీఆర్ఎస్‌ను చిత్తుగా ఓడిస్తారనే నమ్మకం తనకు ఉందని రాజగోపాల్ రెడ్డి తెలిపారు.