ఏపీ మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాజకీయంగా తమ మనుగడ వైసీపీతోనేనని తెలిపారు.
తన ప్రకటనకు తన భర్త దయాసాగర్ కట్టుబడే ఉంటారన్నారు.తన భర్త పార్టీ మారి తనను కూడా మారమంటే ఆయనతో వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు.
తన భర్త, తాను, తన పిల్లలు వేర్వేరు పార్టీల్లో ఉండమని సుచరిత వెల్లడించారు.తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.







