ఓఆర్ఆర్ నార్సింగి వద్ద రూ.29.50 కోట్లతో ఇంటర్ చేంజర్..: కేటీఆర్

హైదరాబాద్ లోని నార్సింగిలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా కొత్తగా నిర్మించిన ఇంటర్ చెంజర్ ను ఆయన ప్రారంభించారు.

కాగా నార్సింగి వద్ద ఓఆర్ఆర్ పైకి వెళ్లడానికి, కిందకు దిగడానికి రూ.29.50 కోట్లతో ఇంటర్ చేంజర్ ను నిర్మించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సర్వీస్ రోడ్లను విస్తరించాలని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు.

ఓఆర్ఆర్ పై 120 కిలోమీటర్ల వరకు స్పీడ్ లిమిట్ పెంచామని తెలిపారు.అదేవిధంగా మూసీ నదిపై 14 బ్రిడ్జిల నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు.

సెప్టెంబర్ నాటికి హైదరాబాద్ లో మురుగునీరు శుద్దీకరణ పూర్తి చేస్తామని చెప్పారు.శంషాబాద్ నుంచి మూసీ వరకు ఎక్స్ ప్రెస్ వే నిర్మించనున్నట్లు తెలిపారు.

దాంతోపాటు మూసీపై స్కైవే నిర్మిస్తామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ లు పాల్గొన్నారు.

Advertisement
కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

తాజా వార్తలు