టిక్ టాక్ తరహాలో ఇంస్టాగ్రామ్ రీల్ రీమిక్స్ ఫీచర్స్..!

టిక్‌టాక్ ని మించి ఎక్కువ ఫీచర్లను అందిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసా.

భారతదేశంలో టిక్‌టాక్ బ్యాన్ అయిన తర్వాత కోట్ల మంది యూజర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ప్రతిరోజు తరచుగా టిక్‌టాక్ యూస్ చేసే నెటిజన్లు బ్యాన్ అనంతరం ప్రత్యామ్నాయం గా ఎన్నో యాప్స్ ట్రై చేశారు.ఐతే టిక్‌టాక్ తరహాలో యూట్యూబ్ సంస్థ "యూట్యూబ్ షార్ట్స్ అనే ఒక షార్ట్ వీడియోస్ అప్ లోడ్ చేసే ఫీచర్ ని అందుబాటులోకి తెచ్చింది.

ఫేసుబుక్ కూడా టిక్‌టాక్ లాంటి షార్ట్ వీడియో క్లిప్ షేరింగ్ ఆప్షన్ ని తెచ్చింది.మరో వైపు ప్రముఖ ఫొటోస్, వీడియోస్ షేరింగ్ ఫ్లాట్ ఫామ్ అయిన ఇన్‌స్టాగ్రామ్ రీమిక్స్ ఆన్ రీల్స్ అనే ఒక ఫ్యూచర్ ని విడుదల చేసింది.

అయితే టిక్‌టాక్ ని మించి ఇన్‌స్టాగ్రామ్ సంస్థ అద్భుతమైన ఫ్యూచర్ లను యూజర్లకు అందిస్తుండటంతో నెటిజన్ల నుంచి మంచి ఆదరణ వస్తోంది.టిక్‌టాక్ బ్యాన్ అయిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఆన్ రీల్స్ ఫీచర్ జర్మనీ, ఫ్యాన్స్ తో పాటు భారతదేశంలో కూడా అందుబాటులోకి వచ్చింది.

Advertisement

ఐతే ఈ ఆన్ రీల్స్ ఫీచర్ ద్వారా 15 సెకండ్ల నిడివిగల సొంత వీడియోలు అప్ లోడ్ చేసుకోవచ్చు.అనంతరం ఆ వీడియోకి సంగీతాన్ని యాడ్ చేసుకోవచ్చు.

ఎడిటింగ్, స్పీడు, రివైండ్, టైమర్, అలైన్ వంటి టూల్స్ ఉపయోగించి షార్ట్ వీడియోలను అద్భుతంగా క్రియేట్ చేసుకోవచ్చు.

ఇంతకీ ఈ రీల్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుంటే మొదటగా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి అనంతరం ఎడమవైపు పైభాగంలో ఉన్న కెమెరా ఐకాన్ పై క్లిక్ చేయాలి.అప్పుడు మీకు వీడియో, లైవ్, రీల్స్ అనే మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి.వాటిలో రీల్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

అంతే ఇక మీరు ఎంచక్కా రీల్స్ వీడియో క్రియేట్ చేసుకోవచ్చు.అలాగే రీల్స్ రీమిక్స్ ఆప్షన్ ద్వారా మీరు ఏ షార్ట్ వీడియో ని రీమిక్స్ చేయాలనుకుంటున్నారో.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

దాన్ని ఎంపిక చేసుకొని రీమిక్స్ చేసుకోవచ్చు.దీనివల్ల ఒరిజినల్ వీడియో ఒక సైడ్ వస్తే మీ వీడియో ఇంకొక సైడ్ వస్తుంది.

Advertisement

గత సంవత్సరంలో అందుబాటులోకి వచ్చిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కాలక్రమేణా అద్భుతమైన సరికొత్త ఫీచర్లతో అప్డేట్ అవుతూ నెంబర్ వన్ గా నిలుస్తోంది.ఏడాది కాలంలో రికార్డ్ చేసే సమయాన్ని 15 నుంచి 30 సెకనులకు పెంచడంతోపాటు రివర్స్ కౌంటింగ్ టైమర్‌ను 10 సెకన్లకు పెంచడం వంటి ఉపయోగకరమైన అప్డేట్స్ విడుదలచేసింది.

వీడియో క్లిప్స్ కట్ చేయడం, జోడించడం వంటి ఆప్షన్లు కూడా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

తాజా వార్తలు