హైదరాబాద్, 29 మే: జీ తెలుగు( Zee Telugu ) ప్రారంభమైనప్పటి నుండి ఆసక్తికరమైన ఫిక్షన్, నాన్ ఫిక్షన్ షోలతో ప్రేక్షకులను అలరిస్తోంది.ప్రత్యేక కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందిస్తోంది.
తెలుగు టెలివిజన్ మార్కెట్లో విజయవంతంగా కొనసాగుతున్న జీ తెలుగు సరికొత్త వెలుగులతో కొత్త లోగోతో( New log ) మీ ముందుకు రానుంది.ప్రకాశవంతమైన వెలుగుతో నిండిన లోగోతో వినోద ప్రపంచంలో సంచలనం సృష్టించేందుకు సిద్దమైంది.
జీ తెలుగు 18వ వార్షికోత్సవ వేడుక జీ మహోత్సవంలో మే 21, 2023న యంగ్ సెన్సేషన్ నవీన్ పొలిశెట్టి జీ తెలుగు న్యూ బ్రాండ్ లోగోను ఆవిష్కరించారు.
జీ తెలుగు కొత్త లోగో: https://www.youtube.com/watch?v=gIfTjO2bDBk కొత్త లోగో అంతర్గత బలాన్ని సూచించే ప్రేక్షకులకు దృశ్య రూపకం అయిన ప్రకాశవంతమైన వెలుగుని సూచిస్తుంది.ఇది ఆత్మవిశ్వాసం మరియు తేజస్సు యొక్క బలమైన & ప్రకాశవంతమైన భావం, ఇది జీవితాల్లోకి సరికొత్త వెలుగులు తెచ్చి, చిరస్మరణీయమైన క్షణాలను అందిస్తుంది.జీ తెలుగు విస్తృతమైన అన్వేషణ, విశ్లేషణ అనంతరం ప్రాంతీయ సాపేక్షతను చాటే ముద్దబంతి రంగులోని నిండుదనంతో కొత్త లోగోను రూపొందించింది.
ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.