రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్( President Putin ) ఒక ఫ్యాన్సీ, రక్షిత రైలులో ప్రయాణిస్తారు.ఈ ట్రైన్ గురించి మొన్నటిదాకా ఎవరికీ తెలియలేదు.
అయితే నిన్న రష్యా ప్రభుత్వానికి సంబంధించిన ఒక వెబ్‌సైట్ ఈ రైలు లోపలి చిత్రాలను తొలిసారిగా విడుదల చేసింది.ఈ రైలులో జిమ్, స్పా, కాస్మోటాలజీ సెంటర్ వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి.
ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ఈ ట్రైన్( Train ) ప్రస్తుతం 60 మిలియన్ పౌండ్లతో అప్‌గ్రేడ్ పొందుతోంది.
పుతిన్ ఈ రైలును ఇష్టపడటానికి ప్రధాన కారణం అది విమానాల వలె ట్రాకింగ్‌కి గురికాదు.
రైలులో ప్రెసిడెంట్ కోసం ప్రత్యేక క్యారేజీలు ఉన్నాయి, ఇవి చాలా విలాసవంతమైనవి, దాదాపు £3.75 మిలియన్లు ఖర్చవుతాయి.ఇందులో ఫాన్సీ షవర్లు, అరోమా ఫోమ్, యాంటీ ఏజింగ్ కోసం ప్రత్యేక యంత్రాలు కూడా ఉన్నాయి.
ఊపిరితిత్తుల వెంటిలేటర్, డీఫిబ్రిలేటర్ వంటి వైద్య పరికరాలు కూడా ఉన్నాయి.రైలులో త్వరలో సినిమా, హెల్త్ క్యారేజీ తీసుకొచ్చే అవకాశం ఉంది.
పుతిన్ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు, అతన్ని “ది చీఫ్ ప్యాసింజర్”( The Chief Passanger ) అని పిలుస్తారు.రైలు చాలా విలాసవంతమైనది.ఇందులో షవర్, ఫుల్ సైజు టాయిలెట్, ఫోన్, పెద్ద టీవీ, డీవీడీ ప్లేయర్లు ఉన్నాయి.రైలులో సాయుధ భాగాలు కూడా ఉన్నాయి, కానీ రైలు మొత్తం కాదు.
ట్రైన్ కొన్ని ఆయుధాలు, తుపాకీ కాల్పుల నుంచి పూర్తిస్థాయిలో రక్షణ ఇస్తుంది.ఈ రైలు ఆపరేషన్ సీక్రెట్ గా జరిగిపోతాయి.
పబ్లిక్ షెడ్యూల్‌లలో ఈ ట్రైన్ టైమింగ్స్ ఉండవు.ఇది ప్రత్యేక లోగోలను కలిగి ఉంటుంది.
ఎల్లప్పుడూ ఒకే మార్గాన్ని అనుసరిస్తుంది.