అదో ఆస్పత్రి. పేషంట్ కు ఆపరేషన్ జరుగుతోంది.డాక్టర్ ఎంతో ఏకాగ్రతగా రోగికి శస్స్తచికిత్స చేస్తున్నాడు.తల వద్ద అయినా గాయాలకు కుట్లు వేస్తున్నాడు.పక్కనే ఉన్న నర్సులు ఆయనకు సహాయంగా ఉన్నారు.అంతా చాలా శ్రద్ధగా పని చేస్తున్నారు.
సర్జరీ పూర్తి అయింది.పేషెంట్ కు మత్తు మందు ఇవ్వడంతో కదలడం లేదు.
డాక్టర్ కుట్లు వేసిన దగ్గర నర్సులు బ్యాండేజ్ కడుతున్నారు.పేషెంంట్ ప్రాణాలకు ఏ ప్రమాదమూ లేదని కోలుకున్న తర్వాత క్షేమంగా అడవిలో వదిలిపెడతామని డాక్టర్ చెప్పాడు.
అదేంటి అడవిలో వదిలిపెట్టడం ఏంటి అనుకుంటున్నారా.ఎందుకంటే ఆ పేషెంట్ ఓ పాము కాబట్టి.
డాక్టర్ సర్జరీ చేసింది పాముకే కాబట్టి.అది కోలుకున్న తర్వాత అడవిలో వదిలి పెడతామని డాక్టర్ చెప్పాడు.
అది కర్ణాటక రాష్ట్రం, మానవీ పట్టణం కరాదిగుడ్డ రోడ్డులో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ లో తాచు పాము చిక్కుకుంది.విలవిల్లాడుతున్న ఆ పామును గమనించి స్థానికులు పాముల సంరక్షకుడు రమేశ్ కు సమాచారం అందించారు.
ఆ పాము తల వద్ద తీవ్ర గాయాలైనట్లు గుర్తించాడు రమేష్.దానికి చికిత్స అవసరమని భావించి దానిని జంతు వైద్యశాలకు తరలించాడు.

తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తీసుకువచ్చిన పామును చూసి అక్కడి పశు వైద్యుడు రాజు కంబలే దానికి కుట్లు వేసి చికిత్స చేయాలన్నాడు.అన్నీ సిద్ధం చేశారు.పాముకు మత్తు మందు ఇచ్చి ఆపరేషన్ ప్రారంభించారు.తల వద్ద తీవ్ర గాయాలు అయ్యాయి.కొంత చర్మం తెగిపోయింది.అక్కడ కుట్లు వేశాడు పశు వైద్యుడు.
తర్వాత అక్కడే బ్యాండేజ్ వేశారు.