ప్రభుత్వ ఉచిత పథకాలపై ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు...!!

భారతదేశంలో రాజకీయం ఎక్కువగా ఉచిత పథకాలు( Free Schemes ) చుట్టూ తిరుగుతూ ఉంటుంది అన్న సంగతి తెలిసిందే.ప్రజలు కూడా ఏ పార్టీ ఎక్కువ ఉచిత పథకాలు ప్రకటిస్తే… ఆ పార్టీకి ఎక్కువ అధికారం కట్ట బెట్టిన దాఖలాలు చాలానే ఉన్నాయి.

 Infosys Founder Narayanamurthy Sensational Comments On Government Free Schemes D-TeluguStop.com

దీంతో చాలా రాజకీయ పార్టీలు ప్రజలను సోమరిపోతులు చేస్తున్నట్లు విమర్శలు వస్తూనే ఉన్నాయి.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ప్రభుత్వాలు ఇచ్చే ఉచిత పథకాలపై ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి( Infosys Founder Narayanamurthy ) అసంతృప్తి వ్యాఖ్యలు చేశారు.

పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు అందిస్తున్న ఉచితాలను ప్రజలు వినియోగించుకుంటున్నారు.

అయితే నేను ఉచితలకు వ్యతిరేకం కాదు.సమాజంలో పేదల పరిస్థితిని అర్థం చేసుకోగలను.ఈ క్రమంలో రాయితీ పొందిన వారు తిరిగి సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి.

ఉచిత విద్యుత్( Free Electricity ) అందిస్తే దానికి బదులుగా బిడ్డలను బడికి పంపించి చదివించాలని స్పష్టం చేశారు.మొన్ననే దేశం అభివృద్ధి చెందాలంటే యువత వారానికి కనీసం 70 గంటల పని చేయాలని నారాయణ మూర్తి వ్యాఖ్యలు చేశారు.

ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో కాంట్రవర్సీగా మారాయి.ఆ రకంగా 70 గంటలు పని చేస్తే ప్రపంచంతో భారత్( India ) పోటీ పడుతుందని యువత మూడు షిఫ్టులు పనిచేస్తే చైనాను అధిగమించగలమని పేర్కొనడం జరిగింది.

ఈ క్రమంలో ఇప్పుడు ప్రభుత్వాల అందించే పథకాలపై.నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube