ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో 5G స్మార్ట్ ఫోన్( Infinix Note 40 Pro 5G ) సేల్ భారత మార్కెట్లో ప్రారంభం అయింది.ఈ ఫోన్ డిజైన్, స్పెసిఫికేషన్ వివరాలతో పాటు ఆఫర్ వివరాల గురించి తెలుసుకుందాం.
ఈ ఫోన్ 40ప్రో, 40ప్రో+ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో 5G స్మార్ట్ ఫోన్ మిడ్ రేంజర్ సెగ్మెంట్ లో పెద్ద సంచలనం సృష్టిస్తుంది.రూ.5000 విలువైన ప్రీ ఆర్డర్ ప్రయోజనాలను వినియోగదారులు పొందవచ్చు.8GB RAM+256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్( Internal Storage ) లో అందుబాటులో ఉంటుంది.ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.21999 గా ఉంది.ఏప్రిల్ 18వ తేదీ నుండి ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.
![Telugu Infinix, Infinix Pro, Infinixpro, Smartphone-Technology Telugu Telugu Infinix, Infinix Pro, Infinixpro, Smartphone-Technology Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/04/Infinix-Note-40-Pro-5G-Smartphone-Specifications.jpg)
< ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.ఈ ఫోన్ 6.78 అంగుళాల FHD+ కర్వ్డ్ AMOLED డిస్ ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1300 నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్ తో ఉంటుంది.ఈ ఫోన్ 2160Hz PWM డిమ్మింగ్ తో ఉంటుంది.
మీడియా టెక్ డైమెన్సిటీ 7020 6nm ప్రాసెసర్ పై పని చేస్తుంది.ఈ ఫోన్ హై రిజల్యూషన్ 108-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో లెన్స్, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ తో అనుబంధించబడిన ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ను కలిగి ఉంటుంది.
వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 32-మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా( Front Camera )తో ఉంటుంది.ఆండ్రాయిడ్ 14 ప్లాట్ ఫారంలో ఇన్ఫినిక్స్ యొక్క XOS 14 ఇంటర్ ఫేస్ తో రన్ అవుతుంది.
![Telugu Infinix, Infinix Pro, Infinixpro, Smartphone-Technology Telugu Telugu Infinix, Infinix Pro, Infinixpro, Smartphone-Technology Telugu](https://telugustop.com/wp-content/uploads/2024/04/Infinix-Note-40-Pro-5G-Smartphone-Features-and-Specifications.jpg)
ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో+ ఫోన్ 4600 mAh బ్యాటరీ( Infinix Note 40 Pro Plus Battery ) సామర్థ్యం కలిగి,100W ఫాస్ట్ చార్జింగ్ కు మద్దతు ఇస్తుంది.ఇన్ఫినిక్స్ నోట్ 40ప్రో 5000mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి 45W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.ఈ రెండు వేరియంట్లు 20W వైర్ లెస్ మాగ్ ఛార్జ్ మద్దతుతో ఉంటాయి.రూ.25 వేల లోపు బడ్జెట్ లో వైర్ లెస్ చార్జర్ ఇవ్వడం ఇదే మొదటిసారి.ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్లు ఉన్నాయి.
IR సెన్సార్, JBL- ట్యూన్ స్టీరియో స్పీకర్, IP 53 రేటింగ్ లాంటి ఫీచర్లతో ఉంటుంది.