టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu ) ఉభయ గోదావరి జిల్లాలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలో రెండు సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.
రఘురామ కృష్ణరాజుకు( Raghurama Krishnam Raju ) ఒక సీటు, బీజేపీతో మరో సీటు సర్దుబాటుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సమాచారం.ఈ క్రమంలోనే రఘురామకు నరసాపురం పార్లమెంట్ లో సీటు( Narsapuram Parliament Seat ) సర్దుబాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఏలూరు పార్లమెంట్ లో మరో సీటు సర్దుబాటు కాదని జిల్లా నేతలు చెబుతున్నారు.అదేవిధంగా అనపర్తికి బదులు బీజేపీ( BJP )కి మరో సీటు సర్దుబాటుపై చంద్రబాబు నేతలతో చర్చిస్తున్నారని తెలుస్తోంది.
ఈ క్రమంలో సీట్ల సర్దుబాటుపై రేపటి లోపు తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం.