Movie Industry: ఇక్కడ నెగ్గాలంటే ట్యాలెంట్ ఒక్కటే కాదు..ఇంకా చాల ఉంది

ఇంగ్లీష్ చిత్ర పరిశ్రమ అయినా హాలీవుడ్ ని ల్యాండ్ అఫ్ డ్రీమ్స్ అంటారు.అక్కడ సినిమా అవకాశాల కోసం ప్రతి ఏడాది లక్షకు తగ్గకుండా జనాలు వస్తూనే ఉంటారు.

 Industry Will Teach You Every Thing Details, Movie Industry, Tollywood, Hollywoo-TeluguStop.com

అందులో కొందరు ఆర్టిస్టులు కావాలని, మరి కొంత మంది టెక్నీషియన్స్ కావాలని ప్రయత్నిస్తారు.కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి అవకాశం లభిస్తుందా అంటే వంద శాతం కాదు.

కేవలం ఆ లక్షల్లో ఒక్క శాతం మాత్రం ఎదో ఒక అవకాశం అందుకొని విజయవంతం అవుతారు.మరి మిగిలిన ఆ 99 శాతం మంది ఏళ్లకు ఏళ్ళు ఎదో ఒక అవకాశం రాకపోతుందా అని ఎదురుచూస్తూనే ఉంటారు.

ఏది దొరక్క వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు.

ఇలా భగ్న అవకాశాల తో ఏ దిక్కు తోచక తిరిగి వెళ్లే వాళ్ళు అదే హాలివూడ్ ని ల్యాండ్ అఫ్ బ్రోకెన్ డ్రీమ్స్ అంటూ తిట్టుకుంటూ వెళ్ళిపోతారు.

అక్కడ కట్ చేస్తే టాలీవుడ్ లో కూడా అదే పరిస్థితి.సినిమా పరిశ్రమ ఏదైనా పరిస్థితి లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.ఇప్పటి దాకా చెప్పిన లెక్కలన్నీ కూడా అన్ని సినిమా ఇండస్ట్రీ లకు వర్తిస్తాయి.ఇందులో హిందీ, తెలుగు నుంచి ఏ పరిశ్రమ కూడా మినహాయింపు కాదు.

ఏ ఇండస్ట్రీ అయినా కూడా విజయ సాధించే వారి శాతం కేవలం ఒక్కటి లేదా రెండు మాత్రమే.సినిమా పుట్టిన రోజు నుంచి నేటి వరకు అన్ని భాషల్లో ఇదే కొలమానం.

Telugu Actors, Bollywood, Heroes, Hollywood, Dreams, Technicians, Tollywood-Movi

సినిమా పరిశ్రమ ఏ దశ లో ఉన్న కూడా ఎంత మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఉన్న కూడా వేళ్ళమీద లెక్క పెట్టేంత మంది మాత్రమే సక్సెస్ సాధిస్తారు.ఆ కొంత మందిని ఆదర్శంగా తీసుకొని ఇంకా వందల్లో, వేళల్లో సినిమా పిచ్చి తో ఇండస్ట్రీ కి వస్తూనే ఉంటారు.అయితే సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు మంచిదే.కానీ దానికంటూ ఒక సిస్టం ఉంటుంది.ఆ సిస్టం లో వెళ్తేనే, లేదంటే ఇమిడితేనే అక్కడ పనికి వస్తారు.ట్యాలెంట్ ఎంత ఉంది అనేది కాదు, ఎలా పని చేస్తుంది అనేది కాదు దాన్ని మించిన ఒక శక్తి ఎప్పుడు పని చేస్తూనే ఉంది.

ఇక్కడ అన్ని తట్టుకొని గెలిచినా వాడే ఎక్స్పర్ట్ అవుతాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube