రామ్ హీరోగా లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కిన ది వారియర్ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.ఈ నెల 14వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండగా కృతిశెట్టి మ్యాజిక్ వర్కౌట్ అవుతుందని ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
అయితే ఈ మధ్య కాలంలో యావరేజ్, ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాలకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు.
అయితే ఇండస్ట్రీ చూపు ప్రస్తుతం ది వారియర్ సినిమాపై ఉంది.
ది వారియర్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కమర్షియల్ అంశాలతో తెరకెక్కింది.లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కిన పలు సినిమాలు ఇప్పటికే తెలుగులో విడుదలై సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.
లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో మాస్ ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండటం గమనార్హం.
ఇస్మార్ట్ శంకర్, రెడ్ విజయాల తర్వాత రామ్ నటిస్తున్న ఈ సినిమా అంచనాలకు మించి హిట్ అవుతుందో అంచనాలను అందుకోలేక ఫ్లాప్ అవుతుందో చూడాల్సి ఉంది.
రామ్ తమ నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ఫ్యాన్స్ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.భారీ బడ్జెట్ తో ది వారియర్ తెరకెక్కగా ఈ సినిమాకు 30 నుంచి 35 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు సైతం భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.ది వారియర్ రిలీజ్ కావడానికి మరో వారం రోజుల సమయం మాత్రమే ఉంది.ఆది పినిశెట్టి ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండగా ఆది ఖాతాలో సక్సెస్ చేరుతుందో లేదో చూడాల్సి ఉంది.రామ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.