ఆ కానిస్టేబుల్ చేసిన పనికి ఆనంద్ మహేంద్ర ఫిదా.. కారణం ఏంటంటే...!?

గుజరాత్ రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ చేసిన పనికి ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద మహీంద్రా ఫిదా అయ్యారు.కానిస్టేబుల్ ధైర్య సాహసాలను చూసి ప్రశంసల వర్షం కురిపించారు.

 Industrialist Anand Mahindra Tweets About The Constable Who Drove Bolero In Guja-TeluguStop.com

దీనికి సంబంధించి ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు.ఇప్పుడు ఆయన చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది.

ఇంతకీ ఆ కానిస్టేబుల్ ఏమి చేసారు.ఆనంద్ మహీంద్ర ఎందుకు ఆ కానిస్టేబుల్ ను మెచ్చుకున్నాడంటే.?! గుజరాత్ రాష్ట్రంలో ఇటీవలే భారీ వర్షాలు కురిశాయి.ఈ విషయం అందరికి తెలిసిందే.

కురిసిన వర్షాలకు భారీగా వరదలు వచ్చి రహదారులన్నీ జలమయమయ్యాయి.దీంతో రాజ్ కోట్ సిటీలో దాదాపు నడుంలోతులో భారీగా వరద నీరు చేరాయి.

రోడ్లు కనిపించకుండా ఉండడంతో వాహనాలు ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి.ఈ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న గుజరాత్ పోలీసులు భారీగా వరద నీరు చేరి జలమయమైన రాజ్ కోట్ వెళ్ళాల్సి ఉండడంతో అటు వైపు బొలెరో వాహనంలో బయల్దేరారు.

అయితే అంత వరద నీటిలో ఏ మాత్రం భయం లేకుండా ఓ కానిస్టేబుల్ బొలెరో వాహనాన్ని నడిపాడు.దీంతో అక్కడే ఉన్న కొందరు బొలెరో వాహనాన్ని నడుపుతున్న కానిస్టేబుల్ ను వీడియో తీశారు.

ఈ వీడియోను కానిస్టేబుల్ సోషల్ మీడియా లో షేర్ చేశారు.దానికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా పెట్టారు.

బొలెరో వాహనం ఎంతో పవర్ ఫుల్ కారు కావొచ్చు.కానీ దానిని నడిపించాలంటే.ఓ పవర్ ఫుల్ డ్రైవర్ కావాలి.’ అంటూ ట్వీట్ చేశారు.ఈ ట్వీట్ తో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు, తమ కంపెనీ వాహనాలు ఎంతో పవర్ ఫుల్ అంటూ ​ఆనంద్ మహీంద్ర మరోసారి ట్వీట్ చేశారు.​సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారిన ఈ వీడియో, ట్వీట్ ను చూసిన నెటిజన్లు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube