Sridevi Drama Company: రాత్రికి వస్తావా అంటూ అందరి ముందు రష్మితో రెచ్చిపోయిన ఆటో రామ్ ప్రసాద్.. ఫైరైన ఇంద్రజ?

గత కొన్ని సంవత్సరాల నుండి మల్లెమాల ప్రొడక్షన్ లో జబర్దస్త్ షో ( Jabardasth ) ఈటీవీలో ప్రసారమవుతూ ఎంతలా ప్రేక్షకుల ఆదరణ పొందిందో చూశాం.కానీ ఇప్పుడు ఆదరించిన వాళ్ళే ఈ షోపై బాగా విమర్శలు చేస్తున్నారు.

 Indraja Comments On Auto Ram Prasad Comments On Rashmi In Sridevi Drama Company-TeluguStop.com

కారణం ఈ షోలో మితిమీరి, హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు కాబట్టి.కమెడియన్స్ వేసే డైలాగులు, పంచులు ఇతరులను కించపరిచే విధంగా ఉన్నాయి.

మామూలుగా మొదట్లో ఈ షో బాగా రన్ అయింది.చాలామంది కమెడియన్స్ ( Comedians ) ఈ షో ద్వారానే తమలో ఉన్న టాలెంట్ ను బయటపెట్టారు.

తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు.కానీ రాను రాను మితిమీరి ప్రవర్తిస్తున్నారు.

ఒకప్పుడు ఫ్యామిలీతో కలిసి చూసే ఈ షోను ఇప్పుడు ఫ్యామిలీతో కలిసి చూడాలంటేనే భయమేస్తుంది.ఎందుకంటే కమెడియన్స్ అలా తయారవుతున్నారు.

బాగా డబల్ మీనింగ్ వచ్చే డైలాగులు, శోభనం సీన్స్, బాడీ షేమింగ్స్, ఇతరులను ఉద్దేశించి కామెంట్లు చేయడం ఇలా రకరకాలుగా విమర్శలు ఎదుర్కొంటుంది జబర్దస్త్. గతంలో ఇటువంటివి ఎదురవటం వల్లే చాలామంది ప్రేక్షకులు ఈ షో పై కేసు వేస్తారు.ఇక ఆ సమయంలో కాస్త కుదుట పడినట్లు కనిపించారు.కానీ మళ్ళీ అలాగే ప్రవర్తిస్తున్నారు.

దీంతో చూసే జనాలు కూడా ఈ షో పై విరక్తి రావటంతో చూడటమే మానేశారు.

Telugu Anchor Rashmi, Auto Ram Prasad, Ram Prasad, Indraja, Indraja Angry, Jabar

అయితే ఇన్ని రోజులు ప్రేక్షకాధారాన్ని పొందిన శ్రీదేవి డ్రామా కంపెనీ( Sridevi Drama Company ) కూడా అలాగే తయారవుతుంది.ఇందులో కూడా జబర్దస్త్ కమెడియన్స్ పాల్గొంటున్న సంగతి తెలిసిందే.కేవలం అక్కడే కాకుండా ఇక్కడ కూడా మితిమీరి డైలాగులు కొడుతున్నారు.

డబల్ మీనింగ్ డైలాగ్స్ తో రెచ్చిపోతున్నారు.దీంతో ప్రేక్షకులు కూడా ఆ షోపై బాగా ఫైర్ అవుతున్నారు.

అయితే శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

Telugu Anchor Rashmi, Auto Ram Prasad, Ram Prasad, Indraja, Indraja Angry, Jabar

ఇక అందులో జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్( Auto Ramprasad ) డబల్ మీనింగ్ డైలాగ్ తో రెచ్చిపోయాడు.ఇంతకు అసలు ఏం జరిగిందంటే.స్కిట్లో భాగంగా ఆటో రామ్ ప్రసాద్ యాంకర్ రష్మిని.

( Anchor Rashmi ) రాత్రికి రమ్మని అంటాడు.వెంటనే రష్మీ ఫైర్ అవుతూ నన్నెందుకు రమ్మంటున్నావ్ అని అనగా.

అయితే ఎందుకు రమ్మంటున్నానో నీకు తెలియదా .అంటూ సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ డబల్ మీనింగ్ వచ్చేలాగా మాట్లాడుతాడు.

Telugu Anchor Rashmi, Auto Ram Prasad, Ram Prasad, Indraja, Indraja Angry, Jabar

ఇక అక్కడే ఉన్న ఇంద్రజ( Indraja ) కాస్త ఫైర్ అయ్యి ఏయ్.అని అంటుంది.వెంటనే ఆటో రాంప్రసాద్.మేడం మా ఊర్లో జాతర చేయాలి అందుకే పిలుస్తున్నామండి అని కవర్ చేస్తారు.దీంతో ఆ ప్రోమో చూసిన వాళ్ళంతా బాగా ఫైర్ అవుతున్నారు.అసలు షో స్ చూడాలా వద్దా అంటూ గట్టిగా అడిగేస్తున్నారు.

ఇక ఈ షో ను బ్యాన్ చేయాలి అంటూ ఫైట్ చేస్తున్నారు.కానీ వాళ్లు మాత్రం ప్రేక్షకుల మాటలు అస్సలు పట్టించుకోకుండా తమకు నచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.

ప్రస్తుతం ఆ ప్రోమో మాత్రం యూ ట్యూబ్ లో వైరల్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube