నేటి కాలంలో ఆడవారికి ఎక్కడా కూడా రక్షణ దొరకడం లేదు.కామంతో కళ్లు మూసుకుపోయిన కొందరు మగాళ్లు.
ఆడవారిపట్ల నీచంగా ప్రవర్తిస్తున్నారు.ఎన్ని చట్టాలు తీసుకువస్తున్నా.
ఆడవారిపై అకృత్యాలు, అత్యాచారాలు జరగకుండా ఒక్క రోజైనా గడవటం లేదు.ఇక తాజాగా ఓ వివాహితను లైంగికంగా వేధించిన ఓ పోకిరీకి విలక్షణ తీర్పుతో తిక్క కుదిర్చింది మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ కోర్టు.
ప్రస్తుతం కోర్టు తీర్పు.హాట్ టాపిక్‌గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.
మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని నగరానికి చెందిన విక్రమ్ బాగ్రి.
సమీపంలో ముప్పై ఏళ్ల వివాహిత ఇంటికి వెళ్లి ప్రతి రోజు లైంగికంగా వేధించేవారు.దీంతో సదరు యువతి పోలీసులను ఆశ్రయించడంతో.
విక్రమ్ బాగ్రిపై కేసు పెట్టి అరెస్ట్ చేశారు.అయితే నిందితుడు బెయిలు కోసం అప్పీలు చేసుకోగా.
ఇండోర్ కోర్టు న్యాయమూర్తి రోహిత్ ఆర్య కేసును పరిశీలించి.ఓ అద్భుతమైన, ఆదర్శనీయ మైన సంచలన తీర్పును ప్రకటించారు.

రూ.50 వేల వ్యక్తిగత పూచీపై విక్రమ్ బాగ్రికి ఇండోర్ కోర్టు బెయిలు మంజూరు చేయడంలో పాటు.పలు షరతులు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ముఖ్యంగా రఖీ పండగా సందర్భంగా.నేటి ఉదయం 11 గంటలకు విక్రమ్ బాగ్రి తన భార్యతో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెతో రక్షాబంధన్ కట్టించుకుని.ఆశీర్వాదం తీసుకోవాలని షరత్తు పెట్టింది.
అంతేకాదు, రాఖీ కట్టించుకోవడంతో పాటు ఆమెకు రూ.11 వేలు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అలాగే బాధితురాలికి భవిష్యత్‌లో అన్ని వేళలా రక్షణగా ఉంటానని ఆమెకు భరోసా ఇవ్వాలి.మరియు బాధితురాలి కుమారుడికి రూ.5 వేలు ఖర్చు చేసి దుస్తులు, స్వీట్లు కొనివ్వాలని ఆదేశించింది.కాగా, ఈ విషయం బయటకు రావడంతో.
కోర్టు తీర్పుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.