కెనడాలో భారత సంతతి వ్యాపారవేత్తకు ‘‘ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా’’ అవార్డ్..!!

కెనడాలో స్థిరపడిన భారత సంతతికి చెందిన రియల్ ఎస్టేట్ దిగ్గజానికి ప్రతిష్టాత్మక ‘‘ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ కొలంబియా’’( Order of The British Columbia ) అవార్డ్ ప్రకటించారు.బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్ ప్రకటించిన జాబితాలో ఆయన పేరు కూడా వుంది.

 Indo-canadian Real-estate Mogul Daljit Thind Honoured With Order Of British Colu-TeluguStop.com

థిండ్ ప్రాపర్టీస్ అధినేత దల్జిత్ థిండ్ కెనడాలో పేరు మోసిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల్లో ఒకరు.వాంకోవర్‌లోని ప్రీమియర్ రియల్ ఎస్టేట్ డెవలపర్‌( Premier Real Estate Developer )లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన.తక్కువ ధరలో అద్దె ఇళ్లను అందించడానికి కృషి చేస్తున్నారు.తద్వారా నగరాల్లో కీలకమైన గృహాల కొరతను పరిష్కరించడంతో తన వంతు పాత్ర పోషిస్తున్నారు.

Telugu Daljit Thind, Daljitthind, Indo Canadian, Indocanadian, Britishcolumbia-T

బ్రిటీష్ కొలంబియన్ల సేవ, విజయాలకు గుర్తుగా ఈ పురస్కారాన్ని ప్రకటిస్తారు.ఈ సందర్భంగా ప్రావిన్స్ లెఫ్టినెంట్ గవర్నర్ జానెట్ ఆస్టిన్( Lieutenant Governor Janet Austin ) మాట్లాడుతూ.విజేతల వివరాలు వారి కమ్యూనిటీలపై చెరగని ముద్ర వేశాయన్నారు.అలాగే రాబోయే తరాలకు ప్రయోజనం చేకూర్చేలా తమ ప్రావిన్స్‌పై ప్రభావం చూపుతాయని జానెట్ ఆకాంక్షించారు.

పంజాబ్‌ రాష్ట్రం లూథియానా( Ludhiana ) సమీపంలోని రాచియాన్ గ్రామంలో పుట్టిన థిండ్.1990లో బర్నాబీకి వలస వెళ్లారు.ఫార్మాసిస్ట్‌గా స్థిరపడాలని కలలుగన్న థిండ్‌( Daljit Thind ) దానిని అందుకోలేకపోయారు .ఇదే సమయంలో కుటుంబాన్ని పోషించడానికి గాను ఓ కెనడియన్ స్నేహితుడి సాయంతో టైల్ లేయర్‌గా పనికి కుదిరాడు.ఇది అతనికి భవన నిర్మాణ పరిశ్రమ గురించి తెలుసుకోవడానికి వీలు కల్పించింది.నేడు థిండ్ గ్రేటర్ వాంకోవర్‌లో 4 బిలియన్ల వ్యాపార సామాజ్రాన్ని సృష్టించడంతో పాటు 1000 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు.

Telugu Daljit Thind, Daljitthind, Indo Canadian, Indocanadian, Britishcolumbia-T

మానసిక ఆరోగ్యం, విద్య, గృహ నిర్మాణం, క్రీడలు, మహిళా హక్కులు వంటి రంగాలలో చేసిన దాతృత్వ కార్యక్రమాలకు గాను థిండ్‌కు ఎన్నో పురస్కారాలు దక్కాయి.అతని వెబ్‌సైట్ ప్రొఫైల్ ప్రకారం.బ్రిటీష్ కొలంబియాలో హై రైజ్‌లను నిర్మించిన తొలి ఇండో కెనడియన్ డెవలపర్‌లలో థిండ్ ఒకరు.దల్జిత్‌తో పాటు వాంకోవర్‌లో జన్మించిన డెడ్‌ఫూల్, ఫ్రీగై నటుడు ర్యాన్ రెనాల్డ్స్‌‌లకు కూడా ఆర్డ్ ఆఫ్ ది బ్రిటీష్ కొలంబియా అవార్డ్‌ను ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube