భారతీయులను బతికించడానికి.. ట్రంప్ వాడిన డ్రగ్, అనుమతులిచ్చిన సీడీఎస్‌సీవో

భారతదేశం కోవిడ్ సెకండ్ వేవ్‌తో అల్లాడిపోతోంది.గడిచిన 24 గంటల్లో కొత్తగా 3.

66 లక్షల మంది కోవిడ్ బారినపడగా.3754 మంది వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోయారు.పాజిటివ్ లక్షణాలతో ప్రజలు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు.

దీంతో దేశంలో ఏ మూల చూసినా బెడ్లు, ఆక్సిజన్, వైద్య పరికరాలు, టెస్టింగ్ కిట్లు, వ్యాక్సిన్ కొరత వెంటాడుతోంది.మరోవైపు ప్రజలను కోవిడ్ నుంచి రక్షించేందుకు గాను ఇప్పటికే దేశీయంగా అందుబాటులో వున్న కోవిషీల్డ్, కొవాగ్జిన్‌లకు తోడు రష్యా తయారీ స్పుత్నిక్ వ్యాక్సిన్‌కు భారత ప్రభుత్వం అనుమతినిచ్చింది.

అలాగే టీకా అనుమతి ప్రక్రియను మరింత సరళతరం చేసింది.మొన్ననే డీఆర్‌డీవో అభివృద్ధి చేసీన ఔషధానికి అత్యవసర అనుమతినిచ్చింది.తాజాగా స్విట్జర్లాండ్‌ ఫార్మా దిగ్గజం రోచ్‌ అభివృద్ధి చేసిన యాంటీబాడీ కాక్‌టెయిల్‌కు భారత సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతులు లభించాయి.

ఈ ఔషధాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాడారు.అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఉద్దృతంగా సాగుతున్న వేళ .ట్రంప్ కోవిడ్ బారినపడిన సంగతి తెలిసిందే.వృద్ధాప్యం, ఇతర అనారోగ్య సమస్యల నేపథ్యంలో ఆయన కోలుకుంటారా లేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.

Advertisement

కానీ వైద్యుల సూచన మేరకు యాంటీబాడీ కాక్‌టెయిల్‌ ఔషధాన్ని వాడటంతో ట్రంప్ వేగంగా కోలుకున్నారు.ప్రస్తుతం భారత్‌లోని కల్లోలం నేపథ్యంలో ప్రజల ప్రాణాలను కాపాడటంతో పాటు వైద్య రంగంపై ఒత్తిడిని తగ్గించేందుకు ఈ కాక్‌టెయిల్ ఔషధానికి కేంద్రం అనుమతినిచ్చింది.

దీనిని ప్రస్తుతానికి దిగుమతి చేసుకుని మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నారు.సిప్లా దీనిని భారత్‌లో మార్కెటింగ్, పంపిణీ వ్యవహారాలను పర్యవేక్షించనుంది.ఈ ఔషధానికి అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు ఇప్పటికే అత్యవసర వినియోగానికి అనుమతించాయి.

అక్కడి డేటా ఆధారంగానే సీడీఎస్‌సీవో భారత్‌లోనూ వినియోగానికి క్లియరెన్స్ ఇచ్చారు.

కరోనాను ఎదుర్కొనే కాసివిరి మాబ్, ఇమ్డివిమాబ్‌ను కలిపి ఈ యాండీ కాక్‌టెయిల్‌ను అభివృద్ధి చేశారు.ప్రయోగశాలల్లో అభివృద్ధి చేసిన ఈ రెండు ప్రతినిరోధకాలను మోనోక్లోనల్‌ యాంటీ బాడీస్‌ అంటారు.ఇవి మనిషి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థను అనుకరిస్తూ హానికారక వైరస్‌లను ఎదుర్కొంటాయి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

ఇక ప్రస్తుత కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రోటీన్‌పై సమర్థవంతంగా పనిచేయడం ఈ యాంటీబాడీ ప్రత్యేకత.ఈ ప్రొటీన్‌ను అడ్డుకోగలిగితే.వైరస్‌ శరీరంలోని ఏసీఈ 2 కణాలకు అతుక్కోదు.

Advertisement

కాసివిరి మాబ్, ఇమ్డివిమాబ్‌ యాంటీబాడీలు కలిసి స్పైక్‌ ప్రొటీన్లో ఒక ప్రత్యేకమైన భాగంపై పనిచేస్తాయి.అంతేకాకుండా వైరస్‌లో మ్యుటేషన్లు ఏర్పడినా ఇది సమర్ధవంతంగా అడ్డుకుంటుంది.తక్కువ లక్షణాలు ఉన్న వారి నుంచి ఓ మోస్తరు లక్షణాలున్న వారికి ఈ ఔషధం బాగా పనిచేస్తుంది.2 డిగ్రీల నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో సాధారణ రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేసుకోవచ్చు.

తాజా వార్తలు