Biggest elephant : భారతదేశంలో అతిపెద్ద ఏనుగు.. వైరల్ వీడియో చూస్తే స్టన్ అవుతారు..

భారతదేశంలో( India ) మూగ జంతువులను పూజిస్తారనే విషయం తెలిసిందే.కొంతమంది హింసించినా కొంతమంది మాత్రం వాటికి దేవాలయాల్లో ఆశ్రయం ఇచ్చి ఆదుకుంటారు.

ముఖ్యంగా ఆవులను, ఏనుగులను దేవాలయాల నిర్వాహకులు ప్రేమగా చూసుకుంటారు.అయితే ఇటీవల దేవాలయానికి సంబంధించిన ఒక అతిపెద్ద ఏనుగు( biggest elephant ) వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ వీడియోలో ఏనుగు ఒక దేవాలయంలో నుంచి బయటికి వస్తున్నట్లు కనిపించింది.ఏనుగు పైన ఒక దేవుడి విగ్రహం ఉంది.ఆ ఏనుగు ముందు మనుషులు చీమల్లాగా కనిపించారు.

అంటే అది ఎంత పెద్దగా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఈ వీడియోను @historyinmemes అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.షేర్ చేసిన ఒక్క రోజులోనే ఈ వీడియో క్లిప్‌కు రెండున్నర కోట్ల దాకా వ్యూస్ వచ్చాయి.22 సెకన్ల నిడివి గల ఈ వీడియో చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.ఇది నిజంగా ఏనుగేనా? లేకపోతే డైనోసార్ హా? అని చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు.

Advertisement

ఇది పురాతన కాలంలో కనిపించే అతిపెద్ద జడల ఏనుగువలే కనిపిస్తోందని మరికొందరు అన్నారు."ఇండియన్స్ ఒక పెద్ద ఏనుగుకు పూజలు చేస్తున్నారు." అన్నట్లు ఈ వీడియోకి ఒక క్యాప్షన్ జోడించారు.

అయితే చాలామంది నెటిజెన్లు ఈ క్యాప్షన్ తో అంగీకరించలేదు.త్రిస్సూర్ పూరం అనే వార్షిక ఆలయ ఉత్సవం సందర్భంగా ఏనుగు ఒక దేవుడి విగ్రహాన్ని మోస్తూ ఉందని, దేవుడికే ప్రజలు దండాలు పెడుతూ పూజలు చేస్తున్నారని ఒక వ్యక్తి చెప్పాడు.

ఇదొక శివాలయంలో జరిగిందని మరికొందరు పేర్కొన్నారు.ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ వీడియో గురించి అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఏది ఏమైనా ఆ ఏనుగు చాలా పెద్ద ఆకారంతో నెటిజన్లను ఆకట్టుకుంది.ఈ వీడియోను మీరూ చూసేయండి.

షాకింగ్ వీడియో : ఏడేళ్ల బాలుడిని ఢీ కొట్టిన బైకర్.. రోడ్డు దాటుతుండగా ప్రమాదం..
Advertisement

తాజా వార్తలు