అవును, మీరు విన్నది నిజం.ఈ మాటలన్నది మరెవరో కాదు.
అక్షరాలా శ్రీలంక అధ్యక్షుడే ఈ వ్యాఖ్యలు చేయడంతో అంతర్జాతీయంగా ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే( Ranil Wickremesinghe ) అమెరికా డాలర్‌తో సమానంగా భారత రూపాయిని ఉపయోగించాలని కోరుకుంటోందని అన్నారు.
ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంక అధ్యక్షుడు ఇండియన్ సీఈవో ఫోరమ్‌లో ఈ కీలక ప్రకటన చేయడం విశేషం.జపాన్, కొరియా, చైనాలతో సహా పశ్చిమాసియా దేశాలు అపూర్వమైన ఆర్థిక వృద్ధిని సాధించినట్లే.
ఇప్పుడు హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్ ఆర్థిక వృద్ధి సాధించాలని అధ్యక్షుడు విక్రమసింఘే ఈ సందర్భంగా కోరుకోవడం ఆహ్వానించదగ్గ విషయం.

శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘే ఈ సందర్భంగా ప్రసంగిస్తూ, భారత రూపాయి సాధారణ కరెన్సీగా మారితే.దానికి ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు.ఈ సందర్భంగా ఆయన భారత్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi )ని ఆకాశానికెత్తేశారు.
ప్రపంచం అభివృద్ధి చెందుతోందని, దీనితో పాటు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అయితే మరింత వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు.శ్రీలంక భారతదేశానికి సామీప్యతతో పాటు గొప్ప చరిత్ర, సాంస్కృతిక వారసత్వం, 2,500 సంవత్సరాల నాటి వాణిజ్య సంబంధాల వల్ల ప్రయోజనం పొందుతుందని ఈ నేపథ్యంలో తెలిపారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు విక్రమసింఘే తన దేశ ప్రస్తుత పరిస్థితిని ప్రస్తావిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.తాము చాలా దుర్భర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం దాని నుండి బయటికి వస్తున్నామనీ, మందగమనం ఉన్నప్పటికీ.ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని తెలిపారు.ఇదిలా ఉంటే.శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే 2 రోజుల అధికారిక పర్యటన కోసం భారత్( India )కు వస్తున్నారు.ఈ క్రమంలో జూలై 21న రణిల్ విక్రమసింఘే మొదట న్యూఢిల్లీకి చేరుకొని ఇక్కడ ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు.
ఆ తరువాత ఇక్కడ ఇతర ప్రాంతాలను పర్యటించనున్నారు.