ఓ సాధారణ వ్యక్తి రైలులో రిజర్వేషన్ చేసుకొని వెళ్లాలంటే ఇప్పుడు రోజులలో అంత ఆషామాషీ విషయం కాదు.పండగలకు లేకపోతే ఏదైనా సెలవుల సమయంలో సొంత ఊరికి వెళ్లేటప్పుడు రైలు లో ప్రయాణం చేయాలంటే మూడు నుంచి నాలుగు నెలల ముందే అందుకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అంతలా రైల్ ప్రయాణానికి సుముఖత చూపుతున్నారు ప్రజలు.దానికి కారణం కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు ప్రశాంతంగా పడుకొని వెళ్ళవచ్చును భావనతో బస్సు ప్రయాణం కంటే రైలు ప్రయాణం చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు.
ఇక అసలు విషయంలోకి వెళితే.
రైల్ టికెట్లకు సంబంధించి ఇండియన్ రైల్వేస్ ఓ కీలక ప్రకటన విడుదల చేసింది.
ట్రైన్ బయలుదేరే ముందు ప్రిపేర్ అయ్యే రెండో చార్ట్ కోసం సమయాన్ని మళ్లీ పాత పద్ధతికి తీసుకువచ్చారు.అయితే ఇది వరకు రైలు బయలుదేరే సమయం కంటే కేవలం ఐదు నిమిషాల నుంచి 30 నిమిషాల ముందు వరకు రెండో రిజర్వేషన్ చార్ట్ ప్రిపేర్ చేసేవారు.
అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా నేపథ్యంలో చాలా వరకు ట్రైన్స్ క్యాన్సిల్ చేయడంతో తిరిగి మళ్ళీ రెండు గంటల ముందే చార్ట్ ప్రిపేర్ చేసే పాత పద్ధతిని అవలంబించారు.
ఇకపోతే పాత విధానాన్ని కొనసాగించాలని వివిధ రైల్వే జోన్స్ నుండి ఇండియన్స్ రైల్వేస్ కు విజ్ఞప్తులు రావడంతో దాన్ని మళ్ళీ పాత పద్ధతి తీసుకువస్తున్నట్లు రైల్వే శాఖ తెలియజేసింది.
అయితే దేశంలో మళ్లీ రైలు పూర్తిస్థాయి పునరుద్ధరణ ఎప్పుడు నుంచి జరుగుతుందో అన్న విషయంపై మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు రైల్వే శాఖ.ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారమే కేవలం చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే రైళ్లను నడుపుతోంది ఇండియన్ రైల్వేస్.