అమెరికాలో ప్రవాస భారతీయుడి ఆత్మ హత్య..ఎందుకంటే..?

అమెరికాలో ఓ ప్రవాస భారతీయుడు ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

దేశం కాని దేశంలో విగత జీవిగా మృతి చెందటం, తనతో పాటు తన కుటుంభ సభ్యులను కూడా కాల్చి చంపడం ఆందోళన కలిగించింది.

ఈ ఘటనపై విచారణ చేస్తున్న పోలీసులు ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.అసలు అతడు ఆత్మ హత్య ఎందుకు చేసుకున్నాడు, అత్త , కూతురుని కూడా అత్యంత దారుణంగా కాల్చి ఎందుకు చంపాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Indian Origin Man Commits Suicide With Gun Fire, Bhupinder Singh, Suicide, Daugh

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.భారత సంతతికి చెందిన భూపేందర్ సింగ్ అమెరికాలో ఎన్నో ఏళ్ళ క్రితమే స్థిరపడ్డారు.

ఆయన వయసు 57 ఏళ్ళు, అమెరికాలోని న్యూయార్క్ లో స్థిరపడిన ఆయనకు 14 ఏళ్ళ కూతురు ఉంది.కూతురు అత్త ఇద్దరూ కలిసి భూపేందర్ సింగ్ వద్దే ఉంటున్నారు.

Advertisement

అయితే నిన్నటి రోజు రాత్రి 9:30 గంటల సమయంలో తన కూతురు జస్లీన్ కౌర్ పై తుపాకీతో దాడి చేశాడు దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.తదుపరి అతడి అత్త మంజీత్ కౌర్ పై కూడా దాడి చేశాడు.

ఈ ఘటన జరిగిన వెంటనే తనపై కూడా కాల్పులు జరుపుకుని ఆత్మ హత్య చేసుకున్నాడు.అయితే ఈ ఘటనలో గాయపడిన మరో మహిళ రాష్ పాల్ కౌర్ భయంతో వెంటనే బయటకు పారిపోయిందని, స్థానికుల సాయంతో తీవ్ర గాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చేరిందని పోలీసులు తెలిపారు.

అయితే ఈ కాల్పులు జరగడానికి కుటుంభ కలహాలే కారణం అయ్యి ఉండచ్చని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారు.కాగా ఆసుపత్రిలో చేరిన ప్రధాన సాక్షి ఆమె కోలుకుంటేనే కాని అసలు విషయాలు తెలియవని పోలీసులు వెల్లడించారు.

అయితే ఊహించని ఘటనపై భూపేందర్ సింగ్ భండువులు ఆందోళన చెందుతున్నారు.

పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?
Advertisement

తాజా వార్తలు