ఆస్ట్రేలియాలో మన భారతీయుడికి ప్రతిష్టాత్మక ‘‘లోకల్ హీరో’’ అవార్డ్..!!

వరదలు, బుష్‌ఫైర్లు, కరువు, కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రజలకు అండగా నిలిచిన భారత సంతతికి చెందిన సిక్కు వాలంటీర్, అమర్‌సింగ్‌ను ప్రతిష్టాత్మక ‘‘ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ లోకల్ హీరో అవార్డ్ 2023’’లో సత్కరించారు.41 ఏళ్ల అమర్‌సింగ్‌కు గతేడాది నవంబర్ 3న ఈ అవార్డ్‌ను ప్రకటించారు.‘‘ఆస్ట్రేలియన్ ఆఫ్ ది ఇయర్ లోకల్ హీరో అవార్డ్ 2023’’కు ఎంపికైనందుకు గాను ఆ దేశ హోంశాఖ, ఆ దేశ ప్రధాని సైతం అమర్‌సింగ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

 Indian-origin Sikh Amar Singh Gets Australian Of The Year Local Hero Award 2023-TeluguStop.com

ఒకానొక సమయంలో ఆస్ట్రేలియాలో తన రంగు, రూపం, మత విశ్వాసాలపై జాతి వివక్షకు గురయ్యారు అమర్ సింగ్.

అయినప్పటీకి వాటికి భయపడాల్సిన అవసరం లేదని నిరూపించాడు.అంతేకాదు.

తనను అవహేళన చేసిన ఆస్ట్రేలియన్లనే ఆపదలో వున్నప్పుడు ఆదుకుని మానవత్వం చాటుకున్నాడు.ఏడేళ్ల క్రితం ‘‘టర్బన్స్ 4 ఆస్ట్రేలియా’’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించిన అమర్‌సింగ్.

ప్రకృతి వైపరీత్యాల వల్ల నిరాశ్రయులైన వారికి అండగా నిలుస్తున్నాడు.

Telugu Australian, Indianorigin, Sikh Amar Singh, Western Sydney, Award-Telugu N

యుక్త వయసులో వున్నప్పుడు అమర్‌సింగ్ ఆస్ట్రేలియాకు వెళ్లాడు.చిన్నప్పటి నుంచి తనకు సమాజసేవపై మక్కువ వుందని ఆయన తెలిపాడు.ఇతరులకు సహాయం చేయడం, మతం, భాష లేదా సాంస్కృతిక నేపథ్యం అనేది సాయానికి అడ్డంకి కాకూడదని అమర్‌సింగ్ పేర్కొన్నాడు.

ప్రతి వారం వెస్ట్రన్ సిడ్నీలో టర్బన్స్ 4 ఆస్ట్రేలియా ద్వారా 450 మంది వరకు ఆహారం, నిత్యావసర వస్తువులను అందజేస్తున్నాడు .అలాగే పరమత సహనం కోసం కూడా అమర్‌సింగ్ కృషి చేస్తున్నాడు.

Telugu Australian, Indianorigin, Sikh Amar Singh, Western Sydney, Award-Telugu N

అంతేకాకుండా టర్బన్స్ 4 ద్వారా కరువు పీడత ప్రాంతాల్లోని రైతులకు ఎండుగడ్డిని పంపిణీ చేశాడు.లిస్మోర్‌లోని వరద బాధితులకు, సౌత్ కోస్ట్‌లోని బుష్‌ఫైర్ ప్రభావిత ప్రజలకు సామాగ్రిని అందజేశారు అమర్‌సింగ్.ఇక ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్ 19 లాక్‌డౌన్ సమయంలో ఐసోలేషన్‌లో ఒంటరిగా వున్న వారికి ఆహారం అందజేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube