భారతీయ అమెరికన్ ప్రొఫెసర్ శైలజా పైక్( Professor Shailaja Paik ) అరుదైన ఘనతను సాధించారు.
దళితులపై ఆమె చేస్తున్న అధ్యయనానికి గాను ప్రతిష్టాత్మక యూఎస్ జీనియస్ గ్రాంట్‌ను( US Genius Grant ) అందుకున్నారు.
భారత్‌లోని దళిత మహిళలు( Dalit Women ) ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి రాసినందుకు గాను మెక్ ఆర్ధర్ ఫౌండేషన్( MacArthur Foundation ) నుంచి 8,00,000 డాలర్ల జీనియస్ గ్రాంట్‌ను పొందారు.ప్రతియేటా అసాధారణ విజయాలు సాధించిన వ్యక్తులకు ఈ ఫౌండేషన్ పురస్కారాలను ప్రకటిస్తుంది.
దళిత మహిళల బహుముఖ అనుభవాలపై దృష్టి కేంద్రీకరించడం ద్వారా కుల వివక్ష, అంటరానితనంపై ఆమె అధ్యయనం చేశారని ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటిలో( University of Cincinnati ) చరిత్రపై ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు శైలజ.
మహారాష్ట్రలోని పూణేలో ఎరవాడ ప్రాంతంలో ఓ మురికివాడకు చెందిన శైలజ.వార్విక్ యూనివర్సిటీలో చదువుకున్నారు.అక్కడ డాక్టరేట్‌ను అందుకున్న శైలజ.
పూణేలోని సావిత్రిబాయి పూలే యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ చేశారు.
తన ముగ్గురు తోబుట్టువులతో కలిసి 20x20 అడుగుల విస్తీర్ణం ఉండే చిన్నగదిలో శైలజ పెరిగారు.ఆ ఇంట్లో నీటి వసతి, వ్యక్తిగత మరుగుదొడ్డి లేదని .తన చుట్టూ చెత్త, వీధుల్లో పందులు తిరుగుతూ ఉండేవని గుర్తుచేసుకున్నారు.పబ్లిక్ టాయిలెట్ల జ్ఞాపకాలు ఇప్పటికీ తనను బాధిస్తున్నాయని ఆమె తెలిపారు.
పబ్లిక్ కుళాయిల నుంచి పెద్ద పెద్ద పాత్రలలో నీటిని పట్టుకుని ఇంటికి తీసుకొచ్చేవాళ్లమని ఓ ఇంటర్వ్యూలో నాటి అనుభవాలను శైలజ గుర్తుచేసుకున్నారు.
సామాజికంగా, విద్యాపరంగా, మానసికంగా, ఇవన్నీ తనపై చాలా లోతైన ప్రభావాన్ని చూపాయని ఆమె వివరించారు."Dalit Women’s Education in Modern India: Double Discrimination," పేరిట 2014లో తొలి పుస్తకాన్ని శైలజ వెలువరించారు.ఇందులో మహారాష్ట్రలో దళిత మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రస్తావించారు.
"The Vulgarity of Caste: Dalits, Sexuality, and Humanity in Modern India," పేరిట తన రెండో పుస్తకాన్ని శైలజ విడుదల చేశారు.మహారాష్ట్రలోని తమాషా కళాకారుల జీవితాలను ఆమె వివరించారు.
ఇందులో ఎక్కువ మంది దళిత మహిళలు ఉన్నట్లు ఆమె తెలిపారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy