ఆస్ట్రేలియాలోని సిడ్నీలో భారత సంతతికి చెందిన వివాహిత అదృశ్యం కేసు విషాదాంతమైంది.తన ఇంటికి కొద్దిదూరంలోని పొదల్లో ఆమె శవమై తేలారు.43 ఏళ్ల షెరీన్ కుమార్ మృతదేహాన్ని శనివారం పోలీసులు కనుగొన్నారు.ఈ కేసుకు సంబంధించి 37 ఏళ్ల వ్యక్తిని అరెస్ట్ చేసిన ఎన్ఎస్‌డబ్ల్యూ పోలీసులు.
అతనిపై హత్యానేరం మోపారు.షెరీన్ కుమార్ అదృశ్యమైనట్లు గురువారం ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో కుమార్ జాడ కనుగొనేందుకు స్టేట్ క్రైమ్ కమాండ్ హోమిసైడ్ స్క్వాడ్, మిస్సింగ్ పర్సన్స్ రిజిస్ట్రీ, కురింగ్ గై పోలీస్ ఏరియా కమాండ్, స్ట్రైక్ ఫోర్స్ కాస్ట్ వంటి విభాగాలతో సాయంతో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా పోల్ ఎయిర్, డాగ్ యూనిట్ సహాయంతో గత మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించామని పోలీసులు తెలిపారు.ఈ క్రమంలో శనివారం సాయంత్రం 5.50 గంటల ప్రాంతంలో డ్యూరల్ లోని లారీ రోడ్ సమీపంలోని పొదల్లో ఒక మహిళ మృతదేహాన్ని కనుగొన్నట్లు చెప్పారు.
తాము అన్ని రకాల మార్గాల ద్వారా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మరిన్ని వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.షెరీన్ కుమార్ ఫోటోలు విడుదల చేసి ఆమెకు సంబంధించిన వివరాలు తెలిస్తే పోలీసులకు అందజేయాలని అధికారులు పౌరులను కోరారు.
ఇకపోతే.
ఇదే వారం అదృశ్యమైన భారత సంతతికి చెందిన 19 ఏళ్ల రాహుల్ సింగ్ కూడా శవమై తేలాడు.సిడ్నీకి నైరుతి దిశలో పోలీసులు అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఇతను చివరిగా జూలై 17న ఉదయం 6 గంటల ప్రాంతంలో అన్నన్ పర్వతాల వద్ద కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు.