అమెరికా : తమ్ముడిని కాల్చిచంపి, భారత సంతతి వ్యక్తి ఆత్మహత్య , తృటిలో తప్పించుకున్న తండ్రి

అమెరికాలో దారుణం జరిగింది.న్యూయార్క్‌లో( New York ) భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన తమ్ముడిని చంపి, ఆత్మహత్య చేసుకున్నాడు.

కరమ్‌జిత్ ముల్తానీ (33)( Karamjit Multani ) రిచ్‌మండ్ హిల్‌లోని తన ఇంట్లో తన తల్లి, 27 ఏళ్ల సోదరుడు విపన్‌పాల్ ముల్తానీపై( Vipanpal Multani ) కాల్పులు జరిపాడు.ఈ ఘటనలో విపన్‌పాల్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.

అతని తల్లి తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటనకు ముందు కుటుంబ సభ్యులు పిజ్జా పార్టీ( Pizza Party ) చేసుకుని ఆనందంగా గడిపినట్లు స్థానికులు చెబుతున్నారు.అయితే రాత్రి 10.30 గంటలకు కరమ్‌జిత్.విపన్‌పాల్ గదిలోకి వెళ్లి అతనిపై బుల్లెట్ల వర్షం కురిపించినట్లు వీరి తండ్రి భూపిందర్ ముల్తానీ తెలిపారు.

Indian-origin Man Shoots Dead Brother After Pizza Party Kills Self In New York D

అతని బారి నుంచి తప్పించుకున్న భూపిందర్ .( Bhupinder ) స్థానికుల సహాయంతో 911కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.పొరుగు వ్యక్తి ఇంట్లోకి వెళ్లి చూసే సరికి విపన్‌పాల్ కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు.

Advertisement
Indian-origin Man Shoots Dead Brother After Pizza Party Kills Self In New York D

తాను చనిపోవాలని అనుకోవడం లేదని, కాపాడాలని తనను వేడుకున్నాడని ఆ వ్యక్తి సీబీఎస్ న్యూస్‌తో చెప్పాడు.దురదృష్టవశాత్తూ విపన్ తన చేతుల్లోనే ప్రాణాలు వదిలాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.33 ఏళ్ల కరమ్‌జిత్‌కు వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు.అతను ఆర్ధికంగానూ మంచి స్థితిలో ఉన్నాడని, ఎప్పుడూ శాంతంగానే ఉండేవాడని అలాగే కరమ్‌జిత్ వద్ద తుపాకీ( Gun ) ఉన్నట్లు కుటుంబ సభ్యులకు సైతం తెలియదని సీబీఎస్ న్యూస్ నివేదించింది.

Indian-origin Man Shoots Dead Brother After Pizza Party Kills Self In New York D

మరోవైపు.కాల్పుల్లో గాయపడిన భార్యను భూపిందర్ ఆసుపత్రికి తరలించాడు.అయితే ఒకేసారి తన ఇద్దరు కొడుకులను కోల్పోవడంతో ఆయన కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అయితే కుమారుల మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా అని మీడియా ఆయనను ప్రశ్నించగా.పెద్దగా సమస్యలు లేవని, చిన్న చిన్న విభేదాలేనని భూపిందర్ చెప్పారు.

అయితే సొంత కుటుంబ సభ్యులపై కరమ్‌జిత్ ఇంతగా కక్ష కట్టడానికి దారి తీసిన పరిస్ధితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

అసలు తండేల్ జగనా? రామ్మోహన్ నాయుడా? తండేల్ కు పబ్లిసిటీ బాగా జరుగుతోందిగా!
Advertisement

తాజా వార్తలు