కెనడా నిండిపోయింది.. నీ దేశానికి పో , భారతీయుడిపై నోరు పారేసుకున్న కెనడియన్ మహిళ

ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్లు ఉన్నారంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Canada PM Justin Trudeau ) సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఆయన మాటలతో గడిచిన ఏడాది కాలంగా ఇండో కెనడాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి.

మధ్యలో కాస్త సైలెంట్ అయిన ట్రూడో గత వారం బాంబు పేల్చాడు.నిజ్జర్ హత్య కేసులో ఏకంగా కెనడాలో భారత రాయబారిగా ఉన్న సంజయ్ కుమార్ వర్మను అనుమానితుల జాబితాలో చేర్చాడు.

దీనిపై భారత్ భగ్గుమంది.ట్రూడో కారణంగా రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయని ఘాటుగా బదుల్చింది.అలాగే ఢిల్లీలోని కెనడా తాత్కాలిక హైకమీషనర్ సహా దౌత్య సిబ్బందిని బహిష్కరించింది.

అయితే తాను చేసిన వ్యాఖ్యలపై నిలబడాల్సిన ట్రూడో పూర్తిగా చేతులెత్తేశారు.నిజ్జర్ హత్యపై నిఘా వర్గాల సమాచారమే తప్పించి, బలమైన ఆధారాలు లేవని వ్యాఖ్యానించారు.

Advertisement

ఈ వ్యాఖ్యలతో ఆయన ఇంటా బయటా విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ట్రూడో చర్యల కారణంగా ఇరుదేశాల ప్రజల మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణం దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో భారత సంతతికి చెందిన వ్యక్తి కెనడాలో జాతి విద్వేషానికి గురయ్యాడు.బాధితుడిని అశ్విన్ అన్నామలైగా( Ashwin Annamalai ) గుర్తించారు.

ఇతను తనకు జరిగిన అవమానాన్ని ఎక్స్‌లో పంచుకున్నారు.అంటారియోలోని వాటర్లూలో( Waterloo ) ఈ ఘటన జరిగింది.

సదరు వీడియోలో అన్నామలై తనను కెనడియన్ పౌరుడినని ఓ మహిళకు చెబుతుండగా .ఆమె నమ్మదు.నువ్వు కెనడియన్‌వి కాదని, భారతీయులతో( Indians ) కెనడా నిండిపోయిందని .మీరంతా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి తిరిగి వెళ్లాలంటూ అక్కసు వెళ్లగక్కింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆ అరుదైన ఘనతను స్టార్ హీరో ప్రభాస్ సాధిస్తారా.. ది రాజాసాబ్ తో కల నెరవేరుతుందా?
విశ్వంభర లో చిరంజీవి త్రిబుల్ రోల్ లో నటిస్తున్నారా..?

దీనిపై వాటర్లూ ఎంపీ కేథరన్ ఫైఫె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.తమ ప్రాంతంలో అత్యధికంగా ద్వేషపూరిత నేరాలు జరుగుతున్నాయని తెలిపారు.

Advertisement

ధైర్యంగా తనకు జరిగిన అవమానాన్ని పంచుకున్న అశ్విన్‌ను కేథరిన్ అభినందించారు.

తాజా వార్తలు