అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని ముగ్గురు భారతీయులు దుర్మరణం

అమెరికాలో దారుణం జరిగింది.టెక్సాస్‌లో( Texas ) జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.

వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.వీరిని అరవింద్ మణి (45),( Arvind Mani ) అతని భార్య ప్రదీపా అరవింద్ (40),( Pradeepa Arvind ) వారి కుమారుడు ఆండ్రిల్ అరవింద్ (17)గా( Andril Arvind ) అధికారులు తెలిపారు.

కాడిలాక్ కారు టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది.దీంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోగా.

అది ఎదురుగా వస్తున్న ట్రాఫిక్‌‌‌లోకి వెళ్లి మణి నడుపుతున్న కియో టెల్లూరైడ్‌ను వేగంగా ఢీకొట్టింది.ఈ కుటుంబం డల్లాస్‌లోని టెక్సాస్ యూనివర్సిటీకి వెళ్తోంది.

Advertisement

ఆండ్రిల్ కంప్యూటర్ సైన్స్‌ క్లాస్‌లో చేరాల్సి ఉండగా ఆ ఘటన జరిగింది.

ఆన్‌లైన్ ఫండ్ రైజింగ్ ఫ్లాట్‌ఫాం GoFundMe పేజీ ప్రకారం.వారి 14 ఏళ్ల కుమారుడు ఆదిర్యాన్ అరవింద్ ఇప్పుడే 9వ తరగతిలోకి అడుగుపెట్టాడు.ప్రమాద సమయంలో కుటుంబంతో పాటు అతను లేకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

ఆగస్ట్ 14 బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది.టెక్సాస్‌లోని కాపెరాస్ కోవ్ నుంచి జాసింటో గుడినో డ్యూరాన్ (31) నడుపుతున్న కాడిలాక్.

ఈ ప్రమాదానికి ముందు వేగంగా వెళ్తున్నట్లు సీబీఎస్ ఆస్టిన్ నివేదించింది.టైర్ పేలడంతో ఈ వాహనం ఎదురుగా వస్తున్న ట్రాఫిక్‌లోకి దూసుకెళ్లి మైల్‌పోస్ట్ 406 వద్ద కియా టెల్లూరైడ్‌ను ఢీకొట్టింది.

జుట్టు సహజంగానే సిల్కీగా మెరిసిపోవాలా.. అయితే ఈ రెమెడీ మీకే!
స్టార్‌బక్స్ సంచలన నిర్ణయం.. భారత సంతతి సీఈవో లక్ష్మణ్ నరసింహన్‌కు ఉద్వాసన, ఎందుకిలా..?

రెండు కార్లలోని డ్రైవర్లు , ప్రయాణీకులు సహా మొత్తం ఐదుగురు వ్యక్తులు ఘటనాస్థలిలో ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.

Advertisement

అయితే ఒకేసారి కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలవ్వడంతో మణి ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకోగా.అరవింద్ మణి- ప్రదీప దంపతుల చిన్న కుమారుడు ఆదిర్యాన్ అరవింద్ దిక్కులేని వాడయ్యాడు.ఎన్నో కలలు, ఆకాంక్షలతో ఉన్న ఈ బాలుడికి.

తన తల్లిదండ్రులు, సోదరుడి అంత్యక్రియలు, చట్టపరమైన ఖర్చులకు సాయపడేందుకు వీలుగా GoFundMe పేజీలో విరాళాల సేకరణ నిర్వహిస్తున్నారు.ఈ ఘటనపై అమెరికాలోని భారతీయ కమ్యూనిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

తాజా వార్తలు