యూకే : కింగ్ చార్లెస్ పట్టాభిషేకం.. ఆహ్వానితుల జాబితాలో భారత సంతతి మహిళా చెఫ్

మే 6న లండన్‌లో జరిగే కింగ్ ఛార్లెస్ , క్వీన్ కెమిల్లా పట్టాభిషేక వేడుకల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు తరలిరానున్నారు.

 Indian-origin Chef Manju Malhi Among Community Champions On King Charles Coronat-TeluguStop.com

ఇందుకోసం ఇప్పటికే ఆహ్వాన పత్రికలు కూడా సిద్ధం చేస్తున్నారు.ఈ క్రమంలో రాయల్ ఇన్విటేషన్ లిస్ట్‌లో బ్రిటీష్ ఎంపైర్ మెడల్ (బీఈఎం) విజేతలలో ఒకరైన భారత సంతతికి చెందిన చెఫ్‌కు స్థానం దక్కింది.

ఈమె ఎవరో కాదు మంజు మల్హి .( Chef Manju Malhi ) కరోనా సమయంలో లండన్ కమ్యూనిటీకి చేసిన సేవలకు గాను మల్హికి బీఈఎం మెడల్‌ లభించింది.ఈ నేపథ్యంలో మే 6న వెస్ట్ మినిస్టర్ అబ్బేలో జరిగే కింగ్ చార్లెస్ పట్టాభిషేక వేడుకల్లో( King Charles Coronation ) 850 మంది బీఈఎం అవార్డు గ్రహీతలు, ఇతర కమ్యూనిటీ ఛాంపియన్‌లు, ఛారిటీ ప్రతినిధులు పాల్గొననున్నారు.

Telugu Brit, Britishempire, Charles, Charlesinvite, London, Manju Malhi, Queen C

ఇక మల్హి విషయానికి వస్తే.ఆమె ప్రొఫెషనల్ చెఫ్. 2016 నుంచి ఓపెన్ ఏజ్‌ అనే స్వచ్ఛంద సంస్థకు రెసిడెంట్ చెఫ్‌గా వ్యవహరిస్తున్నారు.లండన్‌లోని( London ) వృద్ధుల శ్రేయస్సు కోసం ఈ సంస్థ పనిచేస్తోంది.50 ఏళ్లు దాటినవారు శారీరక, మానసిక దృఢత్వాన్ని కొనసాగించడానికి సాయం చేస్తోంది.ఓపెన్ ఏజ్ కిచెన్‌ను మంజు కుకరీ స్కూల్‌గా , స్వచ్ఛంద సంస్థ సభ్యులు, సిబ్బంది కోసం రెస్టారెంట్‌గా మార్చింది.కోవిడ్ 19 సమయంలో రిమోట్ కుకరీ క్లాస్‌లను సైతం నిర్వహించి ఆమె పలువురి మన్ననలు పొందింది.

Telugu Brit, Britishempire, Charles, Charlesinvite, London, Manju Malhi, Queen C

అంతేకాకుండా ఓపెన్ ఏజ్ కమ్యూనిటీ బిగ్ లోకల్ ఫ్యామిలీ కుకింగ్ క్లబ్‌కు కూడా మంజు నాయకత్వం వహిస్తున్నారు.ఈ సెషన్‌లు సరదాగా, ఇంటరాక్టివ్‌గా వుంటాయి.అలాగే అన్ని నేపథ్యాలకు చెందిన స్థానికులు భోజనం చేయడానికి ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు మంజు.వాయువ్య లండన్‌లో పుట్టి పెరిగిన మంజు.ఆంగ్లో ఇండియన్ వంటకాలలో నిష్ణాతురాలు.ఆమె తన బాల్యంలో చాలా ఏళ్ల పాటు భారతదేశంలో గడిపింది.

ఈ క్రమంలోనే ఇక్కడి విభిన్నమైన వంటకాలపై పట్టు సంపాదించింది.టెలివిజన్ కుకరీ షోలలో కూడా కనిపించే మల్హి.

భారతీయ- పాశ్చాత్య ప్రభావాలను మిళితం చేసి ‘‘బ్రిట్-ఇండి’’ స్టైల్ ఫుడ్‌కు ప్రాచుర్యం కల్పించారు.ఈ నేపథ్యంలోనే దివంగత క్వీన్ ఎలిజబెత్ 2 చేతుల మీదుగా బీఈఎం మెడల్ అందుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube