కెనడాలో ప్రవాస భారతీయుడిపై కాల్పులు..

అమెరికాలో వారం రోజుల క్రితం శరత్ పై జరిగిన కాల్పుల ఘటన అందరికీ తెలిసిందే శరత్ ని కాల్చి చంపిన తరువాత శరత్ మృతదేహం తన స్వస్థలం అయిన ఇండియా కి వెళ్లి అంత్యక్రియలు జరిగిన రోజునే పోలీసులు అతడిని కాల్చిన వ్యక్తిని చంపేశారు.అయితే ఈ ఘటన నుంచీ విదేశాలలో ఉన్న భారతీయులు తేరుకోక ముందే మరొక ఘటన విదేశాలలో ఉన్న భారతీయులని కలవరపెడుతోంది.

 Indian Nri Parvinder Singh Murdered In Canada-TeluguStop.com

వివరాలలోకి వెళ్తే.

కెనడాలోని బ్రామ్‌ప్టన్‌ నగరంలో నివసిస్తోన్న మరో ప్రవాస భారతీయుడిని దుండగులు కాల్చి చంపిన ఘటన కలకలం రేపుతోంది…2009 లోనే కెనడాకు వలస వెళ్లిన…పల్వీందర్‌ సింగ్ అక్కడ ట్రక్‌ డ్రైవర్‌ గా పనిచేస్తున్నాడు.కొందరు దుండగులు ఒక్కసారిగా అతడి ఇంట్లోకి వెళ్లి ఒక్కసారిగా కాల్పులకి తెగబడ్డారు.ఇంట్లోకి దూసుకు దూసుకొచ్చి కాల్పులు జరిపారు…అయితే ఈ కాల్పులకి తెగబడిన యువకులు మిస్సిస్సాగా ప్రాంతానికి చెందిన యుక్త వయస్కులుగా తెలుస్తోంది.

కాల్పులు జరిగిన తరువాత ముగ్గురు దుండగులు అక్కడి నుంచీ పారిపోయారు.నిందితుల్లో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.అయితే అందరినీ విశాడంలోకి నెట్టే మరొక విషయం ఏమిటంటే రెండు రోజుల క్రితమే అతడు తన పుట్టినరోజును జరుపుకున్నాడు.తన స్నేహితులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతూ తీవ్రమైన దిగ్ర్భాంతికి లొనయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube