అగ్రరాజ్యం అమెరికాలో జాత్యహంకార దాడులు జరుగుతున్నాయి అనుకుంటే ఈ మధ్యకాలంలో కెనడా లోకూడా భారతీయులపై దాడులు మొదలయ్యాయి.గతంలో కెనడాలో ఓ భారతీయ దంపతులపై అక్కడ ఉండే ఒక స్థానికుడు భారత్ తిరిగివెళ్ళిపోమని బెదిరించిన విషయం అందరికీ విధితమే.
అయితే ఈ ఘటన ఇంకా మరువక ముందే మరొక సంఘటన కెనడాలో చోటుచేసుకుంది.ఓ భారతీయుడి విషయంలో స్థానిక మహిళ ప్రవర్తించిన తీరు అందరిని విస్మయానికి గురిచేసింది…వివరాలలోకి వెళ్తే.

గత ఏడేళ్ళుగా కెనడాలో నివాసం ఉంటున్న రాహుల్ కుమార్ తన ఇంటి దగ్గరలో కార్ పార్కింగ్ విషయంలో తన ఇంటి ఎదురుగా ఉన్న కారు పార్కింగ్ స్థలంలోనే స్థానిక మహిళ చేతిలో వేధింపులకు గురయ్యారు.కేవలం పార్కింగ్ విషయంలో అతడితో గొడవ పెట్టుకున్న ఆ శ్వేత జాతీయురాలు.నువ్వు పాకీవి నువ్వు నీ దేశానికి వెళ్లిపో అంటూ ఈస్ట్ ఇండియా పాకివి అంటూ పరుష వ్యాఖ్యలతో అతడిపై మాటల దాడి చేసింది.దాంతో ఈ గొడవని తన సెల్ లో చిత్రీకరిస్తున్నా సరే ఏ మాత్రం బెదురూ లేకుండా దురుసుగా ప్రవర్తించింది.
ఈ వీడియోను రాహుల్ సీటీవీకి ఇవ్వడంతో సదరు మహిళ ఆ వీడియో ని టీవీలో చూసి మరింతగా రెచ్చిపోయింది ఈ సారి టీవీ చానెల్ వారితో గొడవపడింది అయితే ఆ మహిళ తన తప్పుని ఒప్పుకోవడానికి ఏ మాత్రమే కూడా ఒప్పుకోవడంలేదు అయితే రాహుల్ ఈ విషయాన్ని పోలీసుల వరకూ తీసుకుని వెళ్ళాడు అయితే ఇప్పటికీ ఆ మహిళ తాను చేసింది తప్పు ఒప్పుకోలేదట.







