భారతీయ వైద్య విద్యార్ధులకు శుభవార్త.మనదేశంలో వైద్య విద్యను అభ్యసించిన వారు ఇకపై విదేశాల్లోనూ ప్రాక్టీస్ చేయొచ్చని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం స్పష్టం చేసింది.
ఈ మేరకు వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెడికల్ ఎడ్యుకేషన్ ( World Federation for Medical Education )(డబ్ల్యూఎఫ్ఎంఈ) నుంచి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ( National Medical Council )(ఎన్ఎంసీ)కి పదేళ్ల కాలానికి గుర్తింపు లభించింది.దీని ద్వారా భారత్‌లో వైద్య విద్యను అభ్యసించిన వారు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్‌లలో పీజీ కోర్సుల్లో చేరడంతో పాటు ప్రాక్టీస్ చేయడానికి వెసులుబాటు కలుగుతుంది.2024 నుంచి భారతీయ వైద్య విద్యార్ధులు విదేశాల్లో విద్య, ప్రాక్టీస్ చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

భారతదేశంలో ప్రస్తుతం 706 మెడికల్ కాలేజీలు వున్నాయి.డబ్ల్యూఎఫ్ఎంఈ( WFME ) ప్రకటన నేపథ్యంలో ప్రస్తుతం వున్న కాలేజీలు, వచ్చే పదేళ్ల కాలంలో ఏర్పాటయ్యే వైద్య కళాశాల్లో చదివేవారు విదేశాల్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు.అంతేకాదు.
భారత్‌లోని మెడికల్ కాలేజీలు, వైద్య నిపుణులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని విశ్లేషకులు అంటున్నారు.వైద్య విద్యలో సరికొత్త ఆవిష్కరణలకు కూడా అవకాశం లభిస్తుంది.
అంతేకాకుండా భారత్‌లో వైద్య విద్యను అభ్యసించిన వారు ప్రపంచంలో ఎక్కడైనా తమ కెరీర్‌ను కొనసాగించవచ్చు.ఈ నిర్ణయం పట్ల మెడికల్ విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే.డబ్ల్యూఎఫ్ఎమ్ఈ గుర్తింపు కోసం మనదేశంలోని ఒక్కో మెడికల్ కాలేజ్ 60 వేల డాలర్ల రుసుమును వసూలు చేస్తుంది.అలా మొత్తంగా 706 వైద్య కళాశాలలు 4,23,60,000 డాలర్లు ఖర్చు చేయనున్నాయి.అయితే ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్ల (ఐఎంజీ) లైసెన్సింగ్‌ను నియంత్రించే అమెరికాలోని ఎడ్యుకేషన్ కమీషన్ ఆన్ ఫారిన్ మెడికల్ ఎడ్యుకేషన్ (ఈసీఎఫ్ఎంజీ) ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది.
యునైటెడ్ స్టేట్స్ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామినేషన్స్ (యూఎస్ఎంఎల్ఈలు) , రెసిడెన్సీ ప్రోగ్రామ్‌లకు దరఖాస్తు చేసుకోవాలనుకునే ఐఎంజీలకు ఈసీఎఫ్ఎంజీ సర్టిఫికేషన్ తప్పనిసరి.