అమెరికాలో విషాదం చోటు చేసుకుంది.న్యూయార్క్‌లోని( New York ) హార్లెమ్ అపార్ట్‌మెంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ భారతీయ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు.
సెయింట్ నికోలస్ ప్లేస్ అపార్ట్‌మెంట్( St.Nicholas Place Apartment ) భవనంలో లిథియం అయాన్ బ్యాటరీ పేలిన కారణంగా జరిగిన ప్రమాదంలో 27 ఏళ్ల ఫాజిల్ ఖాన్( Fazil Khan ) దుర్మరణం పాలవ్వగా.మరో 17 మంది గాయపడ్డారు.ఈ ఘటనపై అమెరికాలోని భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.ఫాజిల్ ఖాన్ కుటుంబ సభ్యులు, స్నేహితులతో టచ్‌లో వున్నామని.ఆయన భౌతికకాయాన్ని భారతదేశానికి తరలించేందుకు అవసరమైన సాయం చేస్తామని తెలిపింది.
కొలంబియా జర్నలిజం స్కూల్( Columbia Journalism School ) పూర్వ విద్యార్ధి అయిన ఫాజిల్ ఖాన్.కొలంబియా యూనివర్సిటీలోని టీచర్స్ కాలేజీలో ది హెచింగర్ రిపోర్ట్‌లో( The Hechinger Report ) డేటా జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నాడు.విద్యలో అసమానత, సరికొత్త ఆవిష్కరణల గురించి నివేదించేవాడు.ఆయన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం .2018లో బిజినెస్ స్టాండర్ట్‌లో కాపీ ఎడిటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు.ఆ తర్వాత ఢిల్లీలోని సీఎన్ఎన్ న్యూస్ 18లో కరస్పాండెంట్‌గా పనిచేశాడు.2020లో కొలంబియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసేందుకు న్యూయార్క్‌కు వెళ్లాడు.
మంటల్లో చిక్కుకున్న అపార్ట్‌మెంట్ వాసులను రక్షించేందుకు తాడును పైకి వదిలారు .దాని సాయంతో అనేక మంది ప్రాణాలతో బయటపడ్డారు.స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది 18 మందిని రక్షించారు.
వీరిలో 12 మందిని స్థానిక ఆసుపత్రికి తరలించగా .నలుగురి పరిస్ధితి విషమంగా వున్నట్లు అధికారులు తెలిపారు.రెడ్‌క్రాస్ ద్వారా ప్రభావితమైన వారికి సమీపంలోని పాఠశాలలో తాత్కాలిక గృహాలను అందజేస్తున్నారు.న్యూయార్క్ అగ్నిమాపక శాఖ ప్రకారం.హార్లెమ్‌లోని ఆరు అంతస్తుల అపార్ట్‌మెంట్ భవనం ‘‘సెయింట్ నికోలస్ ప్లేస్’’ వద్ద లిథియం అయాన్ బ్యాటరీ మంటలను రేకెత్తించింది.ఈ ప్రమాదం ఖాన్‌ను బలి తీసుకుంది.
శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మూడో అంతస్తులో తొలుత మంటలు చెలరేగినట్లుగా సమాచారం.