ChatGPT… ఇపుడు ఇంటర్నెట్ ని కుదిపేస్తున్న అంశం.ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పనవసరం లేదు.
దీనిగురించి కధలు కధలుగా వినబడుతోంది.ఎవరికి నచ్చిన వ్యాసాలు వారు రాసేసుకుంటున్నారు.
ఫ్యూచర్‌లో ఇంటర్నెట్ సెర్చ్‌పై పైచేయి సాధించేందుకు గూగుల్, మైక్రోసాఫ్ట్ పోటా పోటీగా తలపడుతున్నాయి.ఈ క్రమంలోనే భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాట్సాప్ ప్రధానమైన సెర్చ్ ఇంజిన్‌గా మారే అవకాశం ఉంది.
ఇండియాలోని 15 కోట్ల మంది రైతులు.వాట్సాప్‌ని సెర్చ్ ఇంజిన్‌గా వాడుకునే అవకాశాలు ఇపుడు మెండుగా కనిపిస్తున్నాయి.

దీని వెనక AI (ఆర్టిఫిసియల్ ఇంటిలిజెన్స్ (కృత్రిమ మేథస్సు))తో పనిచేసే ChatGPT ఉండే అవకాశం మెండుగా.ఈ జాతీయ స్థాయి ప్రాజెక్ట్ ద్వారా.డేటాను రైతులకు సమర్పించనున్నారు.ఇందులో సమాచారం స్క్రిప్ట్ రూపంలో కాకుండా, భారతీయ భాషల వాయిస్‌తో ఉండే ఛాన్స్ ఉంది.ఇది క్రౌడ్ సోర్సింగ్ విధానంలో ఉండేలా కనిపిస్తోంది.మొబైల్ వాడకం పెద్దగా తెలియని వారిపట్ల ఇది వరంగా మారనుంది.
వాళ్లు ప్రతీదీ టైప్ చేసి అడగలేరు.అందువల్ల రైతులు తమ ప్రశ్నలను వాయిస్ రూపంలో అడగొచ్చు.
వాటికి భాషిణీ టీమ్ వాట్సాప్ ద్వారా ఆన్సర్ ఇస్తుంది.

ప్రస్తుతం ఇలాంటి ప్రాజెక్టుపై పని చేస్తోంది కేంద్రం.కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వశాఖ (MeitY)లో భాషిణీ అనే టీమ్ ఉంది.ఇది ప్రస్తుతం వాట్సాప్ ఆధారిత చాట్‌బోట్‌ని తయారుచేస్తోంది.
ఇది రైతులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం సెకెన్ల వ్యవధిలో ఇస్తుంది.గ్రామాల్లో రైతులకు వాడకం అంతగా తెలియదు కనుక రైతులు తమ ప్రశ్నలను వాయిస్ రూపంలో అడగొచ్చు.
వాటికి భాషిణీ టీమ్ వాట్సాప్ ద్వారా ఆన్సర్ ఇస్తుంది.ఇలాంటి ప్రాజెక్టుపై పని జరుగుతోంది.
భాషిణీ రూపొందించే చాట్‌బోట్‌లో రైతులు తమ ప్రశ్నలను వాయిస్ రూపంలో అడగవచ్చు.







