భారతదేశం నేడు 77 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.భారతదేశంలోని గల్లీ నుంచి ఢిల్లీ వరకు భారతీయులు జాతీయ జెండాను( National Flag ) ఎగురవేసి, సెల్యూట్ చేసి, స్వాతంత్ర సమరయోధులకు నివాళులు అర్పించి తమ దేశభక్తిని చాటుకుంటారు.
స్వాతంత్రం( Independance Day ) పొందిన అన్ని దేశాలలో ఆ దేశాలకు సంబంధించిన జాతీయ జెండాలు దేశమంతా రెపరెపలాడడం సహజమే.ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయిలో ఉండే బుర్జ్ ఖలీఫా అని అందరికీ తెలిసిందే.
ఈ బుర్జ్ ఖలీఫాపై ప్రపంచంలో ఏ దేశం స్వాతంత్రం జరుపుకుంటుందో ఆ దేశానికి సంబంధించిన జెండాను దీనిపై ప్రదర్శిస్తారు.ఆగస్టు 15 భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై భారత జాతీయ జెండా రెపరెపలాడింది.
77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అర్ధరాత్రి 12:01 గంటల సమయంలో బుర్జ్ ఖలీఫా పై( Burj Khalifa ) ఎల్ఈడీ లైట్లతో భారత జాతీయ జెండాను ప్రదర్శించారు.అనంతరం భారత జాతీయ గీతాన్ని కూడా ప్లే చేశారు.ఈ సన్నివేశాన్ని కల్లారా చూసిన ప్రతి భారతీయుడు ఆనందంతో పులకరించి పోయాడు.ఆ సందర్భంలో సగర్వంగా తాము భారతీయులం( Indians ) అని చాటుకున్నారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో చూసే భారతీయులందరూ ఆనందంగా, గర్వంగా ఫీల్ అవుతున్నారు.
ఒకపక్క భారతదేశం స్వాతంత్ర వేడుకలలో మునిగి తేలుతూ ఉంటే.మరొకపక్క పాకిస్తాన్ కు( Pakistan ) ఘోర అవమానం జరిగింది.ఆగస్టు 14 పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం.
సాధారణంగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకునే దేశాల జాతీయ జెండాలను బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది.కానీ ఈసారి పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం నాడు పాకిస్తాన్ జాతీయ జెండా( Pakistan Flag ) బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించబడలేదు.
దీంతో పాకిస్తానీలు తీవ్ర నిరాశ చెందారు.దుబాయ్ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.