యూకే: జీ 7 సదస్సులో కరోనా కలకలం.. ఇద్దరు భారతీయ దౌత్యవేత్తలకు పాజిటివ్

జీ 7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి యూకే వెళ్లిన భారతీయ ప్రతినిధి బృందంలోని ఇద్దరు సభ్యులకు కోవిడ్ 19 పాజిటివ్ తేలినట్లు బ్రిటీష్ మీడియా కథనాలు ప్రచురించింది.

ప్రతినిధి బృందంలో భాగమైన భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ ఈ విషయాన్ని అంగీకరించారు.

ఈ మేరకు జై శంకర్ ట్వీట్ చేశారు.నిన్న సాయంత్రం వీరికి కోవిడ్ కోవిడ్ నిర్థారణ అయినట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో ఇతరుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వర్చువల్ మోడ్‌లో నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు జైశంకర్ చెప్పారు.కాగా జీ 7 సదస్సుకు హాజరు కావాల్సిందిగా యూకే .భారత్‌ను ఆహ్వానించింది.భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాకు కూడా ఆహ్వానించింది.

జూన్‌లో జరగబోయే ఈ కార్యక్రమానికి తీర ప్రాంతంలో వున్న కార్న్‌‌వాల్ రిసార్ట్ వేదిక కానుంది.ప్రపంచంలో ఆర్ధికంగా అభివృద్ధి చెందిన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా దేశాల కూటమే జీ 7.అయితే తొలుత గ్రూప్‌లోని విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు జైశంకర్ నేతృత్వంలోని భారత బృందం యూకే చేరుకుంది.ఈ సమావేశంలో కరోనా , పర్యావరణ మార్పులు, సాంకేతిక అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, స్వేచ్ఛా వాణిజ్యంపై చర్చించనున్నారు.

Advertisement

కాగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్.యూకే హోంశాఖ కార్యదర్శి ప్రీతి పటేల్‌ను కలిశారు.

ఈ సందర్భంగా యూకే ఇండియా కొత్త మైగ్రేషన్ పాలసీపై సంతకం చేశారు.అలాగే ఈ సమావేశానికి హాజరైన అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్‌తో జై శంకర్ భేటీ అయ్యారు.

కాగా దేశంలో 50 ఏళ్ళు దాటిన వారందరికీ మూడో వ్యాక్సిన్ ఇవ్వాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది.క్రిస్మస్ నాటికి దేశంలో కోవిడ్ నిర్మూలన జరగాలని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం భావిస్తోంది.బ్రిటన్‌లో వ్యాక్సినేషన్ కోసం ఫైజర్ బయో ఎన్ టెక్, ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనికా, మోడెర్నా వ్యాక్సిన్లను వినియోగిస్తున్నారు.దేశంలో ఇప్పటి వరకు 36.6 మిలియన్ల మంది వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.అయితే 510 మిలియన్లకు పైగా కోవిడ్ డోసులను ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు