భారత్-పాకిస్తాన్ మ్యాచ్ లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్న భారత ఆటగాళ్లు వీళ్లే..!

ప్రపంచ క్రికెట్లో భారత్-పాకిస్తాన్( Ind vs Pak ) మధ్య జరిగే మ్యాచ్ ఎప్పుడు ఆసక్తికరంగానే ఉంటుంది.

ఈ జట్ల మధ్య మ్యాచ్ కోసం ఇరుదేశాల క్రికెట్ అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రికెట్ అభిమానులు సైతం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తారు.

వరల్డ్ కప్, ఆసియా కప్ లాంటి టోర్నీలలో మాత్రమే ఈ రెండు జట్లు తలబడతాయి.కాబట్టి ఈ జట్ల మధ్య జరిగే మ్యాచ్ కు క్రేజ్ చాలా ఎక్కువ.

ప్రేక్షకులకే ఇలా ఉంటే.బరిలోకి దిగి ఆడే ఇరుజట్ల ఆటగాళ్లకు ఈ మ్యాచ్ ఎంత ప్రత్యేకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇరుజట్లు గెలుపు కోసం చివరి వరకు చాలా కసితో పోరాడతాయి.ఇక ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్లో అద్భుత ఆటను ప్రదర్శించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్( Player Of The Match ) అవార్డు గెలిస్తే.ఆ ఆటగాడి ఆనందానికి అవధులు ఉండవు.

Advertisement

తాజాగా వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా భారత్- పాకిస్తాన్ మ్యాచ్ లో భారత జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును బౌలర్ బుమ్రా( Jasprit Bumrah ) దక్కించుకున్నాడు.

వరల్డ్ కప్ లలో ఇప్పటివరకు జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఎవరెవరు అందుకున్నారో చూద్దాం.భారత జట్టు మాజీ స్టార్ దిగ్గజం సచిన్ టెండుల్కర్( Sachin Tendulkar ) 1992, 2003, 2011 వరల్డ్ కప్ లలో పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకుని ఈ జాబితాలో టాప్ లో నిలిచాడు.1996లో నవజ్యోత్ సిద్దు,( Navjot Sidhu ) 1999లో వెంకటేష్ ప్రసాద్,( Venkatesh Prasad ) 2015లో విరాట్ కోహ్లీ, 2019లో రోహిత్ శర్మ, 2023లో తాజాగా జస్ ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నారు.

Advertisement

తాజా వార్తలు